ఒక్క డైలాగ్ ఆ కొందరికి చె*దెబ్బ…!

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్‌లతో 'గోల్డెన్ లెగ్' అనిపించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఈ పంజాబీ కుట్టి, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన భాషా పరిజ్ఞానం గురించి చేసిన కామెంట్స్

Post Published By: dialnews
Updated : 28 February 2026, 2:15 PM IST

టాలీవుడ్‌లో ఒకప్పుడు వరుస హిట్‌లతో 'గోల్డెన్ లెగ్' అనిపించుకున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఢిల్లీ నుంచి వచ్చి తెలుగు ఇండస్ట్రీని ఏలిన ఈ పంజాబీ కుట్టి, రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో తన భాషా పరిజ్ఞానం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. తన మాతృభాష పంజాబీ కంటే కూడా తెలుగులోనే తాను చాలా ఫ్లూయెంట్‌గా మాట్లాడగలనని రకుల్ చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. చాలా మంది హీరోయిన్లు భాష తెలియకపోయినా '1-2-3-4' లేదా 'A-B-C-D' అంటూ షూటింగ్‌లో మేనేజ్ చేస్తారు. కానీ రకుల్ మాత్రం దాన్ని తప్పు పట్టింది. 'ఏ ఇండస్ట్రీ అయితే మనకు అన్నం పెడుతుందో, ఏ ప్రేక్షకులు మనల్ని స్టార్‌లను చేస్తారో.. ఆ భాషను నేర్చుకోవడం మనం ఇచ్చే కనీస గౌరవం' అని రకుల్ స్పష్టం చేశారు.

డైలాగ్స్ అర్థం కాకుండా కేవలం అంకెలు వల్లెవేస్తూ ప్రేక్షకులను మోసం చేయడం తనకి ఇష్టం లేదని ఆమె చెప్పారు.రకుల్ పుట్టింది పంజాబీ కుటుంబంలో అయినా, ఇప్పుడు ఆమెకు తెలుగుపై పట్టు ఎక్కువట. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నమ్మండి, నేను ఇప్పుడు నా మాతృభాష పంజాబీ కంటే కూడా తెలుగు చాలా ఫ్లూయెంట్‌గా, స్పష్టంగా మాట్లాడగలను' అని చెప్పారు. హైదరాబాద్‌లోనే తన కెరీర్ మొదలవ్వడం, ఇక్కడి వారితో నిరంతరం మాట్లాడటం వల్ల తెలుగు తనకి రెండో మాతృభాషగా మారిపోయిందని రకుల్ గర్వంగా చెబుతుంటారు. ఆమె మొదటి సినిమా 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' సమయంలో కేవలం 'బాగున్నారా?' అనే పదం మాత్రమే తెలుసట. కానీ, షూటింగ్‌లో తన స్టాఫ్ అందరినీ కేవలం తెలుగులోనే మాట్లాడాలని ఆమె రూల్ పెట్టుకున్నారు.

ఏ ఫార్మల్ ట్రైనింగ్ లేకుండానే సినిమాల ద్వారా, సెట్స్‌లో అందరితో ముచ్చటించడం ద్వారానే ఆమె అనర్గళంగా తెలుగు మాట్లాడటం నేర్చుకున్నారు. 'నాన్నకు ప్రేమతో' వంటి సినిమాల్లో తన డైలాగ్ డెలివరీకి ఎంత మంచి పేరు వచ్చిందో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం రకుల్ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్నా, తన మూలాలు మాత్రం సౌత్ ఇండియాలోనే ఉన్నాయని ఎప్పుడూ చెబుతుంటారు. 2026లో రాబోతున్న కమల్ హాసన్ 'ఇండియన్ 3' మరియు మరికొన్ని భారీ ప్రాజెక్టులతో ఆమె మళ్ళీ మన ముందుకు రాబోతున్నారు. భాష ఏదైనా తన పని పట్ల ఆమెకున్న అంకితభావం నిజంగా గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు సినీ అభిమానులు.

Published : 
  • 28 February 2026, 2:15 PM IST