టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న – విజయ్ దేవరకొండల వివాహం ఈ రోజు ఉదయం ఉదయపూర్ లో అత్యంత ఘనంగా జరిగింది. తెలుగు సాంప్రదాయం, కొడవ సాంప్రదాయం ప్రకారం ఈ వివాహాన్ని పెద్దలు నిర్వహించారు. తెలుగు సాంప్రదాయం అంటే మనకు అవగాహన ఉంటుంది. మరి కొడవ సాంప్రదాయ వివాహాలు ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. కొడవ (కూర్గ్) సాంప్రదాయ పెళ్లిళ్లు పూర్వీకుల ఆశీర్వాదాలు, ప్రకృతి పూజలపై ఆధారపడి ఉంటాయి. పూజారులు లేకుండా, కుటుంబ పెద్దలు ప్రధాన పాత్ర పోషిస్తారు.
ప్రధాన ఆచారాలలో.. మనకు మాదిరిగా.. మాంగళ్యధారణ ఉండదు. అలాగే సప్తపది అంటే ఏడు అడుగులు ఉండవు. వధువు ఒడిలో బియ్యం స్థానంలో నాణేల మూట పట్టుకుంటుంది, ఇది సంపద, శుభానికి చిహ్నంగా భావిస్తారు. వధువు తల్లికి పెళ్ళిలో ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది. వధువు కొడవ శైలిలో చీర, శాలువా ధరిస్తుంది. వరుడు సాంప్రదాయ వస్త్రాలు ధరిస్తాడు. పెళ్లి మండపానికి పెద్దలు పూజలు చేస్తారు. వారిని అరువు అని అంటారు. అలాగే బాంబూ, మామిడి ఆకులతో అలంకరిస్తారు.
భోజనం కూడా చాలా స్పెషల్ గా ఉంటుంది. భోజనం బొప్పాయి ఆకులపై వందిస్తారు. తెలంగాణా మాదిరిగా నాన్ వెజ్ కు ఇక్కడ ప్రయారిటీ ఉంటుంది. కడంబుట్టు అంటే రైస్ తో పాటుగా పోర్క్ అంటే పంది మాంసం ముఖ్యం. చికెన్, పాయసం. వెండ్రాయి, డ్రమ్స్ వారి భాషలో దుడితో పాటలు, డాన్స్ లు ఉంటాయి. కొడవ సంప్రదాయంలో పెళ్లి పూర్తిగా పూర్వీకుల ఆశీర్వాదాలపై ఆధారపడుతుంది, పూజారుల పాత్ర తక్కువ. కొడవ పెళ్లిలో “ఊరు కొడవ” కు ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది.
అంటే, వధువు తన ఊరు నుంచి పెళ్లి కొడుకు ఉన్న ఊరుకు వెళ్లి.. అక్కడి పెద్దల సమ్మతితో పెళ్లి జరుపుతారు. ఇక్కడ ఆచారం కూడా కాస్త వింతగా ఉంటుంది. వధువు తలపై నీరు పెట్టి పూర్వీకుల ముందు.. మూడు మంటల మధ్య కూర్చుని సప్తపది చేస్తారు. దీనిని “సమ్మంద కొడుప” అంటారు. అంటే వధువు హక్కులను, వరుడు కుటుంబానికి ఇస్తారు. ఇలా పెళ్లి తంతు పూర్తి చేస్తారు. ఇక్కడ మరో ముఖ్యమనై విషయం ఏంటీ అంటే, కొడవ సంప్రదాయ పెళ్లిలో కావేరి నది (కావేరమ్మ)ని కులదేవతగా పూజిస్తారు. కావేరి నది ఉద్గమం, కొడగు ప్రాంతంలో ఉండటం వల్ల, పెళ్లి ఆచారాలకు కావేరి నదితో దగ్గరి సంబంధాలు ఉంటాయి. వధువు వరుడి ఇంటికి వెళ్లేటప్పుడు కుటుంబ కుండలో (బావి) కావేరి నీటిని పూజించి, తల మీద తీసుకొస్తారు. అలాగే కొక్కెతాతి అంటే నెక్లెస్ లో కావేరి చిహ్నం ఉంటుంది. ఇది శుభకార్యాల్లో ధరిస్తారు.