రౌడీ జనార్దన క్రేజీ అప్‌డేట్.. ఆ సీనియర్ కొత్త అవతారం.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌తో స్పెషల్ ప్లాన్..?

రౌడీ జనార్దన క్రేజీ అప్‌డేట్.. ఆ సీనియర్ కొత్త అవతారం.. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌తో స్పెషల్ ప్లాన్..?

Post Published By: dialnews
Updated : 11 February 2026, 6:41 PM IST

టాలీవుడ్ లో ఇప్పుడు రౌడీ జనార్దన టైటిల్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో ఒక రకమైన ఆసక్తి నెలకొంది. వైవిధ్యమైన కథాంశంతో తెరకెక్కబోతున్న ఈ చిత్రం గురించి రోజుకో వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. తాజాగా ఈ సినిమా కాస్టింగ్ మరియు క్యారెక్టర్లకు సంబంధించి వినిపిస్తున్న కొత్త రూమర్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ఓ స్పెషల్ గెస్ట్ రోల్ ఉండబోతుందని తెలుస్తుంది. కథలో ఎంతో కీలకంగా ఉండే ఈ పాత్ర కోసం మేకర్స్ గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్‌ను సంప్రదించే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమె కనుక గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఈ ప్రాజెక్ట్ రేంజ్ పాన్ ఇండియా స్థాయికి వెళ్లడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇక ఈ ప్రాజెక్టులో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పోషిస్తున్న పాత్రే ప్రధాన హైలైట్‌గా నిలవనుందని ఇండస్ట్రీ టాక్. సాధారణంగా రాజశేఖర్ అంటేనే పోలీస్ పాత్రలు లేదా సీరియస్ రోల్స్ గుర్తొస్తాయి. కానీ రౌడీ జనార్దనలో ఆయన పాత్ర చాలా భిన్నంగా డిజైన్ చేశారని వార్తలు వస్తున్నాయి. ఆయన కెరీర్‌లోనే ఇప్పటివరకూ చూడని సరికొత్త కోణంలో రాజశేఖర్‌ను ఈ సినిమాలో ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. రాజశేఖర్ లుక్‌కు సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాత్ర కోసం ఆయన మేకోవర్ పూర్తిగా మారిపోనుందట. ఇప్పటికే దీనికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ లుక్ టెస్ట్ అవుట్‌పుట్ చూసి యూనిట్ సభ్యులే ఆశ్చర్యపోయారని తెలుస్తుంది. త్వరలోనే ఆయన ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేసి ప్రేక్షకులకు షాక్ ఇవ్వాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ప్రచారం గట్టిగానే జరుగుతుంది.

మొత్తానికి రౌడీ జనార్దన చుట్టూ జరుగుతున్న ప్రచారం సినిమాపై క్యూరియాసిటీని పెంచేస్తోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ ఎంట్రీ, రాజశేఖర్ నెవర్ బిఫోర్ లుక్.. ఇవన్నీ నిజమే అయితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా సందడి చేయడం ఖాయం. అయితే, ఈ రూమర్లపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే. డిసెంబర్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. దాదాపు మూడేళ్ల తర్వాత తెలుగులో ఆమె చేస్తున్న సినిమా ఇది.

Published : 
  • 11 February 2026, 6:41 PM IST