Sreeleela: శ్రీలీలని టెన్షన్‌లో పడేసిన పవర్ స్టార్..

నిధి అగర్వాల్ అంటే చేతిలో ఆఫర్లు లేవు కాబట్టి.. హరిహర వీరమల్లు షూటింగ్ డిలే అయినా ఏం కాదనుకోవచ్చు. కాని శ్రీలీల పరిస్థితి అలా కాదు. మొన్నే పవన్ మూవీ వల్ల అఖిల్‌తో జోడీ కట్టాల్సింది నో చెప్పేసిందట. ఇక వరుణ్ తేజ్ మూవీని కూడా ఇలానే వదులుకోవాల్సి వస్తోందట.

Post Published By: narender Thiru
Updated : 11 September 2023, 4:34 PM IST

Sreeleela: పవర్ స్టార్ ఇప్పుడు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ వివాదం వల్ల అక్కడ వాలాల్సి వచ్చింది. మళ్లీ పొలిటికల్ హీట్ పెరగటంతో ఉస్తాద్ భగత్ సింగే కాదు, ఓజీతోపాటు హరి హర వీరమల్లుకి ఇచ్చిన డేట్లను పక్కన పెట్టాల్సి వస్తోంది. దీంతో ఇప్పుడా సినిమాలు చేయాల్సిన హీరోయిన్లకు తలనొప్పులు పెరిగాయి.

నిధి అగర్వాల్ అంటే చేతిలో ఆఫర్లు లేవు కాబట్టి.. హరిహర వీరమల్లు షూటింగ్ డిలే అయినా ఏం కాదనుకోవచ్చు. కాని శ్రీలీల పరిస్థితి అలా కాదు. మొన్నే పవన్ మూవీ వల్ల అఖిల్‌తో జోడీ కట్టాల్సింది నో చెప్పేసిందట. ఇక వరుణ్ తేజ్ మూవీని కూడా ఇలానే వదులుకోవాల్సి వస్తోందట. ఇంత చేసి ఉస్తాద్ భగత్ సింగ్ చేద్దామంటే.. తీరా టైం కి పవన్ పాలిటిక్స్‌తో బిజీ అయ్యి ఉస్తాద్ భగత్ సింగ్ 14 రోజులు షెడ్యూల్ నుంచి పక్కకు జరిగాడు. పవన్ వచ్చాకే షూటింగ్ అంటే, మరి గుంటూరుకారం కోసం డేట్లిచ్చిన శ్రీలీల షెడ్యూల్ మొత్తం డిస్ట్రబ్ అయ్యేలా ఉంది.

వచ్చిన ఆఫర్లను వదులుకున్నా శ్రీలీలకి పవన్ వల్ల పంచ్ పడేలా ఉంది. ఇక ఓజీ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్.. పవన్ ఎప్పుడొస్తాడా.. ఓజీ ఎప్పడు పూర్తవుతుందా.. తన ఫేట్ ఎప్పుడుమారుతుందా అని గంపెడు ఆశలు పెట్టుకుంది. కాని తను కూడా నిధి అగర్వాల్‌లానే వేయిట్ చేయక తప్పేలా లేదు.

Published : 
  • 11 September 2023, 4:34 PM IST