Kalki : ఆరోజు ‘కల్కి’ గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ (Pan World Movie) కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 12 April 2024, 9:20 AM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ (Pan World Movie) కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. దాదాపు 500 కోట్లకి పైగా బడ్జెట్‌తో వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ (Ashwinidat,) స్వప్నదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను.. మే నెలలోనే రిలీజ్ చేస్తామని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ ఎన్నికల హడావిడి కారణంగా మే 9 నుంచి కల్కి పోస్ట్ పోన్ అయింది. అయితే.. ఇప్పటి వరకు మేకర్స్ నుంచి ఈ విషయంలో క్లారిటీ రాలేదు. కానీ ఇప్పుడో గుడ్ న్యూస్ మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్‌ను కాస్త ఖుషీ చేస్తోంది.

సుమారు మూడేళ్ల పాటు కొనసాగిన కల్కి మూవీ షూటింగ్ ఎట్టకేలకు పూర్తైనట్టుగా తెలుస్తోంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న కల్కి పార్ట్ 1కి చిత్రానికి గుమ్మడికాయ కొట్టేసినట్లు సమాచారం.దీంతో నెక్స్ట్ కల్కి కొత్త రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు అభిమానులు.

ఈ ఏప్రిల్ 17న మేకర్స్‌ సాలిడ్ అప్డేట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ఆరోజే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటించనున్నారట. ఇక కల్కి రిలీజ్‌ డేట్‌కు రెండు ఆప్షన్లు పెట్టుకున్నట్టుగా సమాచారం. కుదిరితే మే 30న రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటున్నారు. లేదంటే జూన్ 20న రిలీజ్ చేసే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది. అయితే.. ఇలాంటి విషయాల్లో క్లారిటీ రావాలంటే.. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో.. కమల్ హాసన్ గెస్ట్ రోల్ చేస్తున్నాడు. సంతోష్ నారాయణ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరి కల్కి రిలీజ్ ఎప్పుడుందో చూడాలి.

Published : 
  • 12 April 2024, 9:20 AM IST