కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మోస్ట్ అవేటెడ్ చిత్రం ‘టాక్సిక్’ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ యాక్షన్ డ్రామా పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో కియారా, రుక్మిణి, నయన్, తారా, హుమా ఖురేషి వంటి ప్రముఖ నటీనటులు నటిస్తుండగా, రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. అలాగే ఈ భారీ సినిమాను కే వి ఎన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కేవలం ఇంకొన్ని గంటల్లోనే థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
అయితే, ఇంత త్వరగా సినిమా విడుదలవుతున్నప్పటికీ, ఇప్పటివరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వెర్షన్ బుకింగ్స్ మాత్రం తెరుచుకోలేదు. సాధారణంగా సినిమా రిలీజ్కు ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయిపోతుంటాయి. కానీ, నిన్ననే తెరుచుకోవాల్సిన ఈ బుకింగ్స్ ఇప్పటికీ రాకపోవడం అభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
సినిమా విడుదలకు గంటల సమయం మాత్రమే ఉన్నా బుకింగ్స్ ప్రారంభం కాకపోవడానికి ప్రధాన కారణం టికెట్ ధరల పెంపు గురించిన చర్చలేనని తెలుస్తోంది. టికెట్ల రేట్ల పెంపు అనుమతుల విషయమై జరుగుతున్న జాప్యమే ఈ ఉత్కంఠకు కారణమని సమాచారం. దీనివల్ల యష్ సినిమాను మొదటి రోజే చూసేందుకు ఉత్సాహంగా ఉన్న ఆడియన్స్లో టెన్షన్ నెలకొంది. మరి ఈ ‘టాక్సిక్’ బుకింగ్స్ ఎప్పుడు మొదలవుతాయి, అభిమానుల ఎదురుచూపులకు ఎప్పుడు తెరపడుతుందనేది వేచి చూడాలి.