Tripti Dimri: ఎన్టీఆర్‌తో నటిస్తా అంటున్న యానిమల్ బ్యూటీ..

యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి వరుస ఇంటర్వూస్తో బిజీగా ఉంది. లేటెస్ట్గా త్రిప్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. సౌత్లో ఎవరితో నటించాలని ఉందని అడగగా.. జూనియర్ ఎన్టీఆర్ అంటూ సమాధానమిచ్చింది.

Post Published By: narender Thiru
Updated : 13 December 2023, 6:25 PM IST

Tripti Dimri: టాలీవుడ్ మోస్ట్ వైలెంట్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి వరుస ఇంటర్వూస్తో బిజీగా ఉంది. లేటెస్ట్గా త్రిప్తి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకుంది. సౌత్లో ఎవరితో నటించాలని ఉందని అడగగా.. జూనియర్ ఎన్టీఆర్ అంటూ సమాధానమిచ్చింది. "ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ ప్రతిభ ఏంటో దేశవ్యాప్తంగా తెలిసిపోయింది.

Shah Rukh Khan: షారుఖ్ సక్సెస్ సీక్రెట్.. అమ్మవారిని దర్శించుకుంటే హిట్ ఖాయమా!

ఆ సినిమా చూస్తూ.. ఇది కదా యాక్టింగ్ అంటే, ఇది కదా డెడికేషన్ అంటే అని నాకు అర్థమైంది. పాషనేట్‌గా ఉంటే, ఔట్‌పుట్ ఎలా ఉంటుందో ఎన్టీఆర్ సినిమాలు చూసి నేర్చుకోవచ్చు" అని యానిమల్ బ్యూటీ చెప్పుకొచ్చింది. యానిమల్ సినిమాలో తృప్తి యాక్టింగ్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఇప్పుడు ఈ అమ్మడి కోసం ఇండియాలో ఉన్న ఇండస్ట్రీలు అన్ని ఆఫర్లతో క్యూ కట్టాయి. ఈ నేపథ్యంలో తృప్తి ఎన్టీఆర్ గురించిన చెప్పిన మాటలు వైరల్‌గా మారాయి.

మరి, ఎన్టీఆర్తో నటించాలని ఉన్న.. త్రిప్తి ఆశలను తీర్చడానికి ఏ డైరెక్టర్ అవకాశం ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

Published : 
  • 13 December 2023, 6:25 PM IST