ప్రభాస్ ఆపినా ఆగని యానిమల్… ఒకేసారి 3 సినిమాలు…!

రెబల్ స్టార్ ప్రభాస్ ఆగమన్నాడు.. కాని ఆగేది లేదని తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఎంతైనా తను పాన్ ఇండియా యానిమల్.. అలాని స్పిరిట్ విషయంలో ఏదైనా సమస్యా అంటే లేనేలేదు.. స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త డిలే అవబోతోందని

Post Published By: dialnews
Updated : 2 April 2026, 5:50 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ఆగమన్నాడు.. కాని ఆగేది లేదని తేల్చేశాడు సందీప్ రెడ్డి వంగ. ఎంతైనా తను పాన్ ఇండియా యానిమల్.. అలాని స్పిరిట్ విషయంలో ఏదైనా సమస్యా అంటే లేనేలేదు.. స్పిరిట్ షూటింగ్ ఇంకాస్త డిలే అవబోతోందని, యాంటీ ఫ్యాన్స్ పండగ చేసుకోవటం కాదు, ఆ వార్తలని వైరల్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో మూడు సినిమాలతో రెబల్ బాంబు పేల్చేస్తున్నాడు ప్రభాస్. ఇది ఎవరూ ఊహించనిది... నిజంగా ఏ పాన్ ఇండియా హీరోకి సాధ్యం కానిది.. ఒకేసారి మూడు సినిమాల షూటింగ్స్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్.. ఆల్రెడీ కల్కీ సీక్వెల్ మొదలైంది. ఫౌజీ పెండింగ్ షూటింగ్ రీస్టార్ట్ కాబోతోంది.. ఇలాంటి టైంలో బ్రేక్ తీసుకుంటుందనుకున్న స్పిరిట్ టీం, రివర్స్ లో వేగం పెంచింది.. అసలు ఒకేసారి మూడు సినిమాల షూటింగ్ ఎలా సాధ్యం..? లుక్ పరంగా ప్రభాస్ ఈ మూడు సినిమాల షూటింగ్ కి ఒకేసారి అటెండ్ అవటం సాధ్యమేనా?

రెబల్ స్టార్ ప్రభాస్ ఆల్ ఆఫ్ సడన్ గా స్పిరిట్ కి భారీ బ్రేక్ ఇచ్చి, ఫౌజీ పెండింగ్ పనుల్లో వేగం పెంచాడు. మరోవైపు ఏప్రిల్ 10 నుంచి కల్కీ 2 షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు. ఈ రెండు నిర్ణయాలతో స్పిరిట్ మూవీ మరింత డిలే అయ్యేలా ఉందన్న ప్రచారం ఊపందుకుంది. అసలే 2025 జనవరిలో మొదలవ్వాల్సిన సినిమా మొన్నీ మధ్యే మొదలైంది.దీని వల్ల షూటింగ్ మొదలవ్వటమే ఏడాది గ్యాప్ తో మొదలైంది. ఇప్పడు ఫౌజీ, కల్కీ 2 సీన్ లోకి రావటంతో, స్పిరిట్ మరింత లేట్ అవుతుందనంటున్నారు. కాని అక్కడే రెబల్ స్టార్ ప్రభాస్ తోపాటు, సందీప్ రెడ్డి కూడా ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. సందీప్ రెడ్డి విషయానికొస్తే, ప్రభాస్ ఫౌజీ షూటింగ్ కి వెళ్లినా, కల్కీ 2 కోసం వచ్చే నెలంతా టైం కేటాయించినా, స్పిరిట్ షూటింగ్ కి బ్రేక్ రాకుండా చూసుకుంటున్నాడు.

అసలు హీరోనే లేకుండా స్పిరిట్ షూటింగ్ ని కానిచ్చేస్తున్నాడు. ఔను హీరోలేని సీన్లు ప్యాచ్ వర్క్ ఇలా ప్రతీదీ ఒక లెక్క ప్రకారం చేసుకుంటూ పోతున్నాడు. ఇక కల్కీ 2 ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేశాక ప్రభాస్, అటు ఫౌజీ, ఇటు స్పిరిట్ రెండు షూటింగ్స్ కి అటెండ్ కాబోతున్నాడు. మద్య మధ్యలో కల్కీ 2 షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తాడు. ఎలా చూసినా మూడు సినిమాల షూటింగ్ తో షాక్ ఇవ్వబోతున్నాడు రెబల్ స్టార్.కాబట్టి, స్పిరిట్ షూటింగ్ డిలే అవుతుందనో, కల్కీసీక్వెల్ వల్ల ఇంకేదో సినిమాకు బ్రేక్ పడుతుందనే ప్రచారం లోనిజం లేదని తెలుస్తోంది. కాని ఇక్కడ ప్రాక్టికల్ గా వచ్చే సమస్య ఏంటంటే, రెబల్ స్టార్ లుక్. ఫౌజీలో సోల్జర్ గా, కల్కీ2లో కర్ణుడిగా, స్పిరిట్ లో పోలీస్ ఆఫీసర్ గా మూడు లుక్స్ మేయింటేన్ చేయాలి.. అలాంటప్పుడు ఒకేసారి మూడు సినిమాల్లో నటించటం కష్టం.

ఎంత ప్యార్ లల్ గా  షూటింగ్ ప్లాన్ చేయాలన్నా లుక్ సమస్య వస్తుంది. కాని ఇక్కడ రెబల్ స్టార్ కి అదే అడ్వాంటేజ్ గా మారింది. కల్కీ 2 లో తను లాంగ్ హేయిర్ తో విగ్ లోకనిపిస్తాడు కాబట్టి, తన లుక్ ఎప్పడంటే అప్పుడు మార్చుకోవచ్చు.. ఇక ఫౌజీ, స్పిరిట్ రెండీంట్లో తన లుక్ సిమిలారిటీస్ ఎక్కువన్ని తెలుస్తోంది. ఫౌజీలో సోల్జర్, స్పిరిట్ లో పోలీస్.. కాబట్టి ఇక్కడ లుక్ పరంగా చిన్న తేడాలే ఉంటాయని తెలుస్తోంది. కాకపోతే హేయిర్ స్టైల్ దగ్గర, ఫౌజీకి, స్పిరిట్ కి చాలా తేడాలున్నాయని తెలుస్తోంది. వాటని పోలీస్ క్యాప్, సోల్జర్ క్యాప్ తో కవర్ చేసి, అలా లుక్ లో డిఫరెన్స్ ని కవర్ చేయబోతోంది ఫిల్మ్ టీం. మొత్తానికి ఒక్కో వారం, ఒక్కో సినిమా తో ప్యార్ లల్ గా, 3 సినిమాల షూటింగ్ తో బిజీ కాబోతున్నాడు రెబల్ స్టార్.

Published : 
  • 2 April 2026, 5:50 PM IST