Rajasab : ప్రభాస్ ‘రాజసాబ్‌’ పరిస్థితేంటి

గత ఏడాది ఆదిపురుష్(Adipurush), సలార్ (Salaar) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌కు, సలార్ సినిమా మాసివ్ హిట్ ఇచ్చింది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 10 May 2024, 11:45 AM IST

 

 

గత ఏడాది ఆదిపురుష్(Adipurush), సలార్ (Salaar) సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌కు, సలార్ సినిమా మాసివ్ హిట్ ఇచ్చింది. ఇక ఈ ఏడాదిలో పాన్ వరల్డ్ (Pan World) లెవల్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడి’ (Kalki 2898 AD) తో జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగ్ అశ్విన్‌ (Nag Ashwin) తెరకెక్కించిన ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయింది. అయితే.. రెండో పార్ట్ ఉంటే మాత్రం మళ్లీ ప్రభాస్ కల్కి సెట్‌లోకి అడుపెట్టాల్సి ఉంటుంది. దానికి ఇంకా చాలా సమయం ఉంది.

ప్రస్తుతానికి మాత్రం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాజాసాబ్ (Rajasab) సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు డార్లింగ్. అయితే.. ఇప్పుడు సలార్ 2 శౌర్యాంగ పర్వాన్ని (Salar 2 Shauryanga Parvam) సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు ప్రశాంత్ నీల్(Prashant Neil). ఈ సినిమా కోసం ప్రభాస్ బల్క్ డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మే ఎండింగ్‌లో షూటింగ్ స్టార్ట్ చేసి.. ఎట్టిపరిస్థితుల్లోను ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ వరకు సలార్ 2 షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యాడట ప్రభాస్.దీంతో రాజాసాబ్ పరిస్థితేంటి అనే చర్చ జరుగుతోంది.

సలార్ 2 (Salaar 2) కారణంగా రాజాసాబ్ షూటింగ్ ఇంకా లేట్ అవనుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మారుతి ఈ సినిమాను ప్రభాస్ డేట్స్ ఇచ్చినప్పుడల్లా షూటింగ్ చేస్తు వచ్చాడు. కానీ ఇప్పుడు సలార్2కి బల్క్ డేట్స్ అంటే, ఇప్పట్లో రాజాసాబ్‌కు డేట్స్ ఇచ్చే అవకాశాలు తక్కువ. రాజాసాబ్‌ను కుదిరితే.. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితి బట్టి చూస్తే.. రాజాసాబ్ మరింత వెనక్కి వెళ్లేలా ఉంది. మరి మారుతి ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి

Published : 
  • 10 May 2024, 11:45 AM IST