RRR Producer: పాపం దానయ్య… ఆస్కార్‌లో నువ్వు ఎవరయ్యా….?

RRR మొదటి నుంచి దానయ్యది ప్రేక్షక పాత్రే. డబ్బులు ఇవ్వడం వరకే దానయ్య. ఎక్కడ అతనికి క్రెడిట్ రానివ్వలేదు రాజమౌళి.

Post Published By: Raju Cln
Updated : 13 March 2023, 7:02 PM IST

తెలుగు ఇండస్ట్రీ లో నిర్మాతల పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో తెలియాలంటే నిర్మాత దానయ్య దీన స్థితి చూడాల్సిందే. ప్రపంచం మొత్తం ఆస్కార్ వైపు చూస్తోంది. ఇండియా మొత్తం నాటు నాటు కి అవార్డ్ వస్తుందా రాదా అని టెన్షన్ పడుతోంది. కానీ RRR నిర్మాత దానయ్య గురించి మాత్రం పట్టించుకున్నవాడు లేడు. పాపం దానయ్య హైదరాబాద్ లో తన ఇంట్లో అందరి లాగే ఆస్కార్ వేడుక చూస్తూ ఎడవలేక నవ్వుతూ చప్పట్లు కొట్టేసాడు. అసలు దానయ్య అనేవాడు RRR నిర్మాత అనే విషయమే ఎవరికి గుర్తులేదు. అలా చేసేసాడు రాజమౌళి.

RRR మొదటి నుంచి దానయ్యది ప్రేక్షక పాత్రే. డబ్బులు ఇవ్వడం వరకే దానయ్య. ఎక్కడ అతనికి క్రెడిట్ రానివ్వలేదు రాజమౌళి. ప్రీ రేలీజ్ ఫంక్షన్స్, ప్రెస్ మీట్లు అన్ని రాజమౌళి, రాం చరణ్, ఎన్టీఆర్ మయమే. డబ్బులు మాత్రం దానయ్య వి. సినిమా హిట్ అయ్యాక దానయ్యని పూర్తిగా అంతర్దనం చేసేసారు. ఇంటర్నేషనల్... నేషనల్ ప్రమోషన్స్ లో పూర్తిగా పక్కన పెట్టేసారు. ఇక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్...ఇతర అవార్డ్ ప్రమోషన్స్, లో దానయ్య అనే వ్యక్తి ఊసే లేదు. నిర్మాత దానయ్య కూడా నాకు ఎందుకు వచ్చిన పెంట అనుకున్నదేమో!

Published : 
  • 13 March 2023, 7:02 PM IST