రెబల్ ఫ్యాన్స్ ఊరుకుంటారా..? ప్రభాస్ డమ్మీతో కొంపకొల్లేరు..?

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఫౌజీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇంతలోనే అమితాబ్, కమల్ హాసన్ తో కలిసి కాంబినేషన్ సీన్లు చేసేందుకు సిద్దమయ్యాడు.

Post Published By: dialnews
Updated : 10 February 2026, 12:44 PM IST

రెబల్ స్టార్ ప్రభాస్ ప్రజెంట్ స్పిరిట్ మూవీ చేస్తున్నాడు. ఫౌజీ షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. ఇంతలోనే అమితాబ్, కమల్ హాసన్ తో కలిసి కాంబినేషన్ సీన్లు చేసేందుకు సిద్దమయ్యాడు. అంటే కల్కీ 2 కూడా సెట్స్ మీదకు ఈనెల్లోనే వెల్లబోతోందని తేలింది. అన్నీ బానే ఉన్నాయి. బాలేంది ఏంటంటే, రెబల్ స్టార్ డమ్మీ పర్సన్... ఔను హీరోలు ఫైట్లు, రిస్కీ సాహసాలు చేసేప్పుడు వాడే డూబ్స్ తోనే సమస్య వచ్చింది. ఈ విషయంలో ఫ్యాన్స్ కూడా ప్రభాస్ ని సపోర్ట్ చేసేలా లేరు. తనకి ఎంత డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నా, ఈ విషయంలో అభిమానుల సపోర్ట్ కూడా కష్టంగానే ఉంది. ఎందుకంటే, తమ అభిమాన హీరో నిచూసేందుకు వాళ్లు థియేటర్స్ కి వెళితే, అక్కడ తన బదులు తన డూప్ ఉండే ఎలా ఉంటుంది.. అదే తట్టుకోలేకపోతున్నారు. ఆల్రెడీ రాజాసాబ్ చూసి షాక్ అయిన వాళ్లు, అదే పని ఫౌజీకి ఎదురైతే తట్టుకోవటం కష్టం.. మరి ఫౌజీరాకముందే డూప్ తో సినిమా తీస్తున్నారని ఎలా అంటారు? అక్కడే లాజిక్ ఉంది.. హరి హర వీరమల్లు టైంలో పవన్ కళ్యాణ్ చేసిన తప్పే ప్రభాస్ ఇప్పుడు చేస్తున్నాడనే మాట, తూటాలా పేలుతోంది. ప్రకాశ్ రాజ్ కూడా స్పిరిట్ మూవీలోంచి బయటికి వెళ్లటానికి రీజన్ , సందీప్ తో క్రియేటివ్ డిఫరెన్స్ లు కారణం కాదా? ప్రభాస్ డూప్ తో నటించాల్సి రావటం తనకి నచ్చలేదా? అసలేం జరుగుతోంది? ఈ డూప్ ల గోలేంటి?

రెబల్ స్టార్ ఫౌజీ, స్పిరిట్ సెట్ల మధ్య చక్కర్లు కొడుతున్నాడు. ఇప్పుడు కల్కీ 2 కూడా మొదలౌతోందంటే, ఇక మూడు సెట్ల మధ్య ప్రభాస్ చక్కర్లు కొట్టడం ఖాయం. ఇదేం తప్పు కాదు. కాని జరుగుతోన్ని తప్పేంటంటే, నిజంగానే ఈ మూవీ సినిమాల షూటింగ్స్ తో రెబల్ స్టార్ బిజీగా మారకపోవటం... ఫౌజీలో తన బదులు, తన డూప్ నటించాల్సి రావటం...యస్ ఇది నిజం.. ఆల్రెడీ మారుతి లాంటి చిన్నా చితకా దర్శకులకు ఛాన్స్ ఇవ్వకండీ రెబల్ స్టార్ గారంటూ, తన ఫ్యాన్స్ గట్టిగానే రిక్వెస్టులు పెడుతున్నారు. సోషల్ మీడియాలో, డార్లింగ్ కోసం ట్వీట్లు పెడుతూనే ఉన్నారు. ఐతే ఇప్పుడు తన ఫ్యాన్స్ అంతా, షాక్ అవుతూనే ఫస్ట్ టైం రెబల్ స్టార్ మీద చిరు కోపాన్ని చూపిస్తోంది మాత్రం ఒకే కారణం చేత... అదే హీరో తన బదులు ఎక్కువగా డూప్ తోనే సీన్లు చేయించటం.

ఇది నిజం, హరీ హర వీరమల్లులో పవన్ డేట్లు కుదరక, ఒకే కథని తెగ్గొట్టి రెండుగా మార్చటమే కాదు... 60శాతం సీన్లు పవన్ డూప్ తోనే తీశారు. తర్వాత తనకి హీరో తలని ఏఐ సాయంతో జోడించారన్నారు. ఇలాంటి ప్రయోగమే రాజాసాబ్ లోకూడా చేశారు. ప్రభాస్ డూప్ తో చాలా సీన్లు, డాన్సులు, ఫైట్లు చేయించి, తనకి రెబల్ స్టార్ ముఖాన్ని ఏఐ సాయంతో జోడించారు.ఇది కూడా ఫ్యాన్స్ కి నచ్చలేదు. ఇలా చేస్తే జన్యూన్ గా కష్టపడ్డ అభిప్రాయం జనాల్లో రాదు.అంతే కాకుండా సీన్ లో క్వాలిటీ ఎమోషన్ లో కనెక్టివిటీ దెబ్బతింటుంది. ఎవరో ప్రభాస్ డూప్ ని చూసేందుకు ఎెందుకు థియేటర్స్ కి రావాలన్న ప్రశ్న ఎదురౌతుంది. ఐతే ఇప్పుడే ఇలా డూప్ వద్దు, ఒరిజనల్ ప్రభాసే ముద్దు అని ఫ్యాన్స్ అనటానికి సాలిడ్ రీజనుంది.

స్పిరిట్ చేసేప్పుడు మరో మూవీ చేయకూడదనే సందీప్ రెడ్డి కండీషన్ వల్ల, ప్రభాస్ ఫౌజీ మూవీలో తన బదులు, తన డూప్ తో పెండింగ్ సీన్లు కానిచ్చేస్తున్నాడనే టాక్ మొదలైంది. ఈ ప్రాసెస్ లో ఒక సీన్ స్పిరిట్ లో కూడా ప్రభాస్ లేకుండా తన డూప్ తో చేయటం, ఆ సీన్ ప్రకాశ్ రాజ్ కాంబినేషన్ సీన్ అవటంతో, ఇలా ప్రభాస్ బదులు, తన డూప్ తో సీన్ ఏంటి అని తనకు నచ్చకే స్పిరిట్ నుంచి తను బయటికెళ్లాడట. కాని బయటికి మాత్రం సందీప్ తో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లే ప్రాజెక్ట్ నుంచి బయటికెళ్లిన ప్రకాశ్ రాజ్ అనంటున్నారు.ఏదేమైనా కల్కీ సీక్వెల్ కూడా మొదలౌైతుండటంతో, ఇలానే డూప్స్ మీద ప్రభాస్ ఆధారపడితే కష్టాలు తప్పేలా లేవు. ఓజీ లాంటి మూవీలో హీరో లేకుండా డూప్ తో కలిసి నటించాల్సి రావటంతో, అందులో నటించినవిలన్ ఇమ్రాన్ హష్మీ కూడా, కొన్ని సార్లు హీరోలు లేకుండా వాల్ల డూప్ లతో నటించాల్సి వస్తుందని సెటైర్ పేల్చాడు.. అదప్పడు హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ప్రభాస్ సినిమాలు కూడా ఇలాంటి ఇబ్బందులకు కేరాఫ్ అడ్రస్ అవటం మంచిది కాదనే మాటే వినిపిస్తోంది.

Published : 
  • 10 February 2026, 12:44 PM IST