పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకల్లో భారత్ ర్యాలీ .

పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సెన్ నదిపై ఆరు కిలోమీటర్ల పరేడ్‌లో 85 పడవలపై దాదాపు 6800 క్రీడాకారులు పాల్గొన్నారు. సుమారు 3,20,000 మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్‌ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 27 July 2024, 6:50 PM IST
1 / 19 \"Zoom\"పారిస్ ఒలింపిక్స్- 2024
2 / 19 \"Zoom\"పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవం
3 / 19 \"Zoom\" పారిస్ ఒలింపిక్స్- 2024 ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి.
4 / 19 \"Zoom\"2024  పారిస్ ఒలింపిక్స్ మెడల్స్
5 / 19 \"Zoom\"భారతీయ ఒలింపిక్స్ క్రీడాకారులు
6 / 19 \"Zoom\"భారతీయ ఒలింపిక్స్ క్రీడాకారులు
7 / 19 \"Zoom\"భారత్ నుంచి 117 మంది క్రీడాకారులు ఈ విశ్వ క్రీడల్లో పాల్గొంటున్నారు.
8 / 19 \"Zoom\"ఒక్కో టీమ్ ఈవెంట్‌లో భారత్ తరపున ఒక జట్టు.. వ్యక్తిగత విభాగాల్లోనూ ఒక్కో కేటగిరీలో భారత్ నుంచి ఒకరు ప్రాతినిధ్యం వహిస్తారు.
9 / 19 \"Zoom\"చిన్న పడవలో ఓ ముసుగు వ్యక్తి ఒలింపిక్‌ జ్యోతి పట్టుకుని రావడంతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.
10 / 19 \"Zoom\"కొన్ని విభాగాలకు సంబంధించి భారత్ తరపున ప్రాతినిధ్యం లేదు.
11 / 19 \"Zoom\"జాతీయ పతాకాన్ని ప్రదర్శిస్తూ ముందుకు సాగారు.
12 / 19 \"Zoom\"పారిస్ ఒలింపిక్స్ లో మెరిసిన తెలుగు బిడ్డ  పీవీ సింధు
13 / 19 \"Zoom\"ఈసారి కనీసం ఐదు బంగారు పతకాలతో కలిపి రెండంకెల సంఖ్యను దాటాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.
14 / 19 \"Zoom\"ముఖ్యంగా బ్యాడ్మింటన్‌(Badminton)లో మూడు పతకాలు, ఆర్చరీలో ఒకటి, బాక్సింగ్, వెయిట్ లిఫ్టింగ్‌లో మూడు నుంచి నాలుగు, ఇతర క్రీడలకు సంబంధించి ఒకటి నుంచి రెండు పతకాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.
15 / 19 \"Zoom\"గతంతో పోలిస్తే భారత్ తరపున పాల్గొంటున్న క్రీడాకారులకు మెరుగైన శిక్షణ అందించడంతో పాటు.. క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారత ఒలింపిక్స్ సంఘం అన్ని చర్యలు తీసుకుంది.
16 / 19 \"Zoom\"కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ సైతం క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తోంది.
17 / 19 \"Zoom\"టోక్యో ఒలింపిక్స్‌లో ఒక బంగారు, రెండు రజత, నాలుగు కాంస్య పతకాలు సాధించగా.. ఈసారి మాత్రం రెండంకెల సంఖ్యను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.
18 / 19 \"Zoom\"ముఖ్యంగా బ్యాడ్మింటన్‌ పురుషుల డబుల్స్‌లో పతకం వచ్చే అవకాశాలు ఎక్కువుగా ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి.
19 / 19 \"Zoom\"భారత క్రీడాకారుల జట్టుకు రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పివి సింధు, టేబుల్ టెన్నిస్ లెజెండ్ ఎ శరత్  కమల్ నాయకత్వం వహించారు.

Published : 
  • 27 July 2024, 6:50 PM IST