America : న్యూయార్క్‌ పార్క్‌లో కాల్పుల కలకలం.. విచక్షణ రహితకంగా కాల్పులు..

అమెరికా (America) లోని న్యూయార్క్ (New York) రాష్ట్రం రోచెస్టర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్‌లో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది.

Post Published By: Suresh Dialtelugu
Updated : 29 July 2024, 6:39 PM IST

అమెరికా (America) లోని న్యూయార్క్ (New York) రాష్ట్రం రోచెస్టర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. న్యూయార్క్‌లో మరో సారి కాల్పుల ఘటన చోటు చేసుకుంది. మాపెల్‌వుడ్‌ పార్క్‌ (Maplewood Park) లో ఆదివారం సాయంత్రం 6:20 గంటలకు ప్రజలు గుమిగూడిన సమయంలో ఒక్కసారిగా తుపాకుల మోత మోగింది. ఈ ఘటనలో 20 ఏళ్ల యువకుడు ఒకరు మృతి చెందగా.. ఆరుగురు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని న్యూయార్క్‌ పోలీసులు తెలిపారు. దుండగుల వివరాలను సేకరిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇప్పటి వరకు ఈ కేసులో ఎవరినీ అరెస్టు చేయలేదు. కాగా హత్యకు గురైన వ్యక్తి ఎవరనేది పోలీసులు వెల్లడించలేదు. పార్కు (Park) నుంచి సందర్శకులు పరుగులు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు వ్యక్తులు స్వల్ప గాయాలతో ఆసుపత్రిలో చేరారు. మరికొందరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.

Suresh SSM

Published : 
  • 29 July 2024, 6:39 PM IST