బ్రేకింగ్: బెజవాడలో దిగిన ఆర్మీ

విజయవాడలో వరదలు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావం ఇంకా అలాగే ఉంది. కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి.

Post Published By: Vencateshg
Updated : 6 September 2024, 7:56 AM IST

విజయవాడలో వరదలు చుక్కలు చూపించిన సంగతి తెలిసిందే. వరద ప్రభావం ఇంకా అలాగే ఉంది. కొన్ని ప్రాంతాలు ముంపులోనే ఉన్నాయి. ఇక బుడమేరుకి పడిన గండ్లు పూడ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం... కేంద్ర ప్రభుత్వ సహకారం అడగడంతో కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బుడమేరు వద్దకు... ఆర్మీని రంగంలోకి దించింది. బుడమేరు వాగు గండ్లు పూడ్చివేతకు రంగంలో దిగాయి ఆర్మీ బృందాలు.

హైదరాబాద్ నుంచి 40 మంది ఇంజనీరింగ్ బృందాలతో ఆర్మీ అధికారులు దిగారు. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి గన్నవరానికి ఆర్మీ వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి గండి పూడ్చివేత పనులు ప్రారంభం కానున్నాయి. నిన్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్... మీడియా సమావేశంలో ఆర్మీ సహకారం తీసుకుంటాం అంటూ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే.

Published : 
  • 6 September 2024, 7:56 AM IST