తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత పాలనలో అధికారుల్లో చాలా మార్పులు జరుగుతున్నాయి. కొందరు ట్రాన్స్‌ఫర్ల మీద వెళ్తుంటే కొందరు మాత్రం ఏకంగా రాజీనామా చేస్తున్నారు. చేస్తున్నారు అనడం కంటే.. సీఎం రేవంత్ రెడ్డి వాళ్లను పీకి పడేస్తున్నారు అనడం కరెక్ట్‌గా ఉంటుంది. గత ప్రభుత్వంలో అధికారాన్ని మించి కేసీఆర్ కోసం పనిచేసిన అందరు అధికారులు వరుసగా పదవులకు రాజీనామా చేయాల్సి వస్తోంది. ఇదే క్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఈవో.. గీతారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.

Another wicket down in KCR team.. Yadadri temple EO resigns..