AP BJP: ఏపీ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థులు వీళ్లే.. పది మందితో లిస్టు విడుదల

పొత్తులో భాగంగా ఏపీలో 175 స్థానాలకుగాను బీజేపీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. బుధవారం సాయంత్రం ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ దక్కించుకోవడం కీలక పరిణామం.

Post Published By: narender Thiru
Updated : 27 March 2024, 7:32 PM IST

AP BJP: ఏపీలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేనతో కలిసి కూటమిగా బీజేపీ ఎన్నికల బరిలో నిలవనుంది. పొత్తులో భాగంగా ఏపీలో 175 స్థానాలకుగాను బీజేపీ.. 10 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయబోతుంది. బుధవారం సాయంత్రం ఏపీలో బీజేపీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. ఈ జాబితాలో విజయవాడ వెస్ట్ సీటును బీజేపీ దక్కించుకోవడం కీలక పరిణామం. నిజానికి విజయవాడ వెస్ట్ సీటును జనసేన అభ్యర్థి.. పోతిన మహేశ్ ఆశిస్తున్నారు. టిక్కెట్ కోసం ఆయన తీవ్రంగా ప్రయత్నించారు. పది రోజులుగా నియోజకవర్గంలో ఆందోళనలు కూడా నిర్వహించారు. దీంతో ఆ టిక్కెట్ జనసేనకు దక్కుతుందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా బీజేపీ నుంచి సుజనా చౌదరి దక్కించుకున్నారు. 2014లో బీజేపీకి ఇక్కడ రెండో స్థానం దక్కింది.

బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ఇది.

ఎచ్చర్ల : ఈశ్వరరావు
విశాఖపట్నం వెస్ట్ : విష్ణు కుమార్ రాజు
అరకు వ్యాలీ : రాజారావు
ధర్మవరం : సత్యకుమార్
అనపర్తి : శివకృష్ణ రాజు
కైకలూరు : కామినేని శ్రీనివాసరావు
విజయవాడ వెస్ట్ : సుజనా చౌదరి
బద్వేలు : బొజ్జ రోషన్
జమ్మలమడుగు : ఆదినారాయణ రెడ్డి
ఆదోని : పార్థసారథి

Published : 
  • 27 March 2024, 7:32 PM IST