చివరి టెస్ట్ ఆడేసాడా ? రాహుల్ చర్యపై చర్చ

బెంగళూరు టెస్టులో ఓటమి తర్వాత ఆటగాళ్లంతా పెవిలియన్ చేరుతుంటే కేఎల్ రాహుల్ మాత్రం భిన్నంగా ప్రవర్తించాడు. మొదట సహచరులతో కలిసి రాహుల్‌ డ్రెస్సింగ్ రూమ్ వైపే నడిచాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి వచ్చి పిచ్‌కు మొక్కి వెళ్లాడు.

Post Published By: Vencateshg
Updated : 22 October 2024, 11:08 AM IST

బెంగళూరు టెస్టులో ఓటమి తర్వాత ఆటగాళ్లంతా పెవిలియన్ చేరుతుంటే కేఎల్ రాహుల్ మాత్రం భిన్నంగా ప్రవర్తించాడు. మొదట సహచరులతో కలిసి రాహుల్‌ డ్రెస్సింగ్ రూమ్ వైపే నడిచాడు. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా వెనక్కి వచ్చి పిచ్‌కు మొక్కి వెళ్లాడు. కర్ణాటకకు చెందిన రాహుల్ తన సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఇలా చేయడం చర్చనీయాంశమైంది. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించినున్నాడని, సొంతమైదానంలో తన ఆఖరి మ్యాచ్ ముగియడంతో భావోద్వేగంతో పిచ్‌ను తాకి వెళ్లాడనే ఊహాగానాలు జోరందుకున్నాయి. టెస్టు జట్టులో మిడిలార్డర్ బ్యాటర్‌‌గా కొనసాగుతున్న కేఎల్ రాహుల్ ఇటీవల తనపై ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. ఈ నేపథ్యంలో తుదిజట్టులో అతని స్థానం‌పై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. బెంగళూరు టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో 12 పరుగులే చేశాడు.

Published : 
  • 22 October 2024, 11:08 AM IST