Priyanka & Rahul Tweets : విజ్ఞతతో ఓటు హక్కు వినియోగించుకోండి : ప్రియాంక, రాహుల్ పిలుపు

తెలంగాణ ఓటర్లు విజ్ఞతతో ఓట్లేయాలని కోరారు కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక. X (ట్విట్టర్ ) ద్వారా తెలుగులో ట్వీట్స్ చేశారు.

Post Published By: dialnews
Updated : 30 November 2023, 11:27 AM IST

Priyanka on TS Election2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఓట్లేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపు ఇచ్చారు AICC జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ . X (ట్విట్టర్) ద్వారా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ స్పందించారు. ప్రియాంక, రాహుల్ ఇద్దరూ తెలుగులోనే ట్వీట్ చేశారు.

నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. మా తల్లులారా..పిల్లలారా.. మీరు బాగా ఆలోచించి పూర్తి ఉత్సాహంతో, శక్తితో ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నా.. ఓటు వేయడం మీ హక్కు, అది మీ అతిపెద్ద బాధ్యత.. ఓటు బలంతో ప్రజల తెలంగాణ కలను సాకారం చేసి చూపండి.. అభినందనలు.. జై తెలంగాణ..జై హింద్ అని రాశారు.

రాహుల్ గాంధీ ఈ రోజు దొరలపై ప్రజలు గెలవబోతున్నారు.. నా తెలంగాణ సోదర సోదరీమణులారా.. రండి.. అధిక సంఖ్యలో ఓటింగ్ లో పాల్గొని బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ఓటేయండి.. కాంగ్రెస్ ను గెలిపించండి అంటూ ట్వీట్ కోరారు.

 

 

 

Published : 
  • 30 November 2023, 11:27 AM IST