RENU DESAI: ఎలక్షన్‌ టైమ్‌లో ఆ టాటూ.. పవన్‌కు రేణుదేశాయ్‌ ఏం చెప్పాలనుకుంటోంది..?

పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ పోస్ట్‌పై జనసైనికులు, పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌ ద్వారా తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్టు అర్థమవుతోంది.

Post Published By: narender Thiru
Updated : 15 April 2024, 4:54 PM IST

RENU DESAI: గల్లీ టు ఢిల్లీ.. ఎలక్షన్‌ హీట్ పీక్స్‌కు చేరింది. నేతలంతా.. ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఏపీ పాలిటిక్స్ రోజుకో మలుపు తీసుకుంటున్నాయ్. జగన్ మీద రాళ్ల దాడి ఘటన తర్వాత.. మరింత మంటలు రేపుతోంది. జగన్‌ మీద రాయితో దాడి చేసిన తర్వాత రోజే.. చంద్రబాబు మీద, ఆ తర్వాత పవన్ మీద సభల్లో రాళ్ల దాడి జరగడం.. కొత్త చర్చకు కారణం అవుతోంది.

IPL 2024: ఎవర్రా మీరంతా..? కోట్లు పెట్టి కొంటే టెస్ట్ బ్యాటింగా..

టీడీపీ, బీజేపీ పొత్తు కుదరడంలో కీలక పాత్ర పోషించిన పవన్.. ప్రచారంలో దూసుకుపోతున్నారు. జగన్ టార్గెట్‌గా ఘాటైన కామెంట్లు చేస్తూ.. రాజకీయాన్ని మరింత రసవత్తరంగా మారుస్తున్నారు. ఐతే పవన్ మాజీ భార్య రేణు దేశాయ్‌ పోస్ట్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతోంది. ఈ పోస్ట్‌పై జనసైనికులు, పవన్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ పోస్ట్‌ ద్వారా తాను కూటమికి మద్దతు ఇస్తున్నట్టు అర్థమవుతోంది. బీజేపీ సింబల్‌ అయిన కమలం గుర్తుతో పాటు.. మౌనం పరం శీలం అంటూ ఓ టాటూని చేతిపై వేయించుకుంది. మాటల కంటే ఫోటోలే ఎక్కువగా మాట్లాడతాయి అని కామెంట్‌ చేసింది. దీంతో రేణు కూటమికే మద్దతు ఇస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఈ విషయం గురించి ఆమె డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. ఆమె చేసిన పోస్ట్‌ ఉద్దేశం మాత్రం అదేనని స్పష్టంగా తెలుస్తోంది.

ఇక అటు రేణు దేశాయ్‌ నటనకు పూర్తిగా దూరంగా ఉన్నారు. పిల్లలను చూసుకోవడంలో బీజీ అయిపోయింది. అకీరా సినిమా ఎంట్రీ గురించి గతంలో చాలా ప్రచారాలు జరిగాయి. అయితే అలాంటిది ఏమైనా ఉంటే తానే అప్‌డేట్‌ చేస్తానని రేణు స్వయంగా ప్రకటించింది. వాటన్నింటినీ మించి ఇప్పుడు ఆమె చేసిన పోస్ట్‌ డిస్కషన్‌ పాయింట్‌గా మారింది. అందరూ ఈ పోస్ట్‌ గురించి రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by renu desai (@renuudesai)

Published : 
  • 15 April 2024, 4:54 PM IST