జెట్ అనిల్ ఇదేం స్పీడ్ దర్శకా?

టాలీవుడ్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రాజెక్ట్ షురూ చేసే వరకు కాస్త సమయం తీసుకున్నా.. ఒక్కసారి సెట్స్ పైకి వెళ్తే మాత్రం జెట్ స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేయడం ఆయన నైజం.

Post Published By: dialnews
Updated : 29 July 2026, 4:10 PM IST

టాలీవుడ్ వినోదాత్మక చిత్రాల దర్శకుడు అనిల్ రావిపూడి పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా ప్రాజెక్ట్ షురూ చేసే వరకు కాస్త సమయం తీసుకున్నా.. ఒక్కసారి సెట్స్ పైకి వెళ్తే మాత్రం జెట్ స్పీడ్‌తో షూటింగ్ పూర్తి చేయడం ఆయన నైజం. అందుకే అభిమానులు సరదాగా "ఇదేక్కడి స్పీడ్ సామీ.. వందే భారత్ ట్రైన్ కంటే వేగంగా ఉన్నావుగా!" అంటూ అనిల్ రావిపూడి వేగాన్ని చూసి ఆశ్చర్యపోతుంటారు.
తాజాగా ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా గురించి అభిమానులకు అద్భుతమైన సర్ ప్రైజ్ ఇచ్చారు అనిల్. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కిందో లేదో.. అప్పుడే ఫ్యాన్స్‌కి ఫుల్ కిక్ ఇచ్చే విషయాన్ని వెల్లడించారు.

జూన్ 22న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవ్వగా, చూస్తుండగానే ఫస్ట్ షెడ్యూల్‌ను దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ విషయానికొస్తే అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అనిల్ రావిపూడి తన కెరీర్ తొలి చిత్రం 'పటాస్'తో నందమూరి కళ్యాణ్ రామ్‌కు భారీ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందించిన సంగతి తెలిసిందే. సరిగ్గా పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ కళ్యాణ్ రామ్‌తో అనిల్ హ్యాండ్ కలపడం విశేషం.
ఈ మల్టీస్టారర్ చిత్రంలో విక్టరీ వెంకటేష్ మరియు కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. విశేషమేమిటంటే.. ఇందులో వెంకీతో సమానమైన ప్రాధాన్యత ఉన్న రోల్‌లో కళ్యాణ్ రామ్ కనిపిస్తారట.

వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చే సన్నివేశాలు థియేటర్లలో నవ్వుల పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. రాయలసీమ నేపథ్యంతో సాగే పూర్తిస్థాయి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కథలోని కామెడీ, ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎలిమెంట్స్ కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేలా ప్లాన్ చేశారు. విక్టరీ వెంకటేష్ సరసన‌ కీర్తి సురేష్ జోడీగా నటిస్తోంది.కళ్యాణ్ రామ్ సరసన యంగ్ అండ్ గ్లామరస్ బ్యూటీ కృతి శెట్టి అలరించనుంది. గత కొన్నేళ్లుగా బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి అల్లుడిగా మారిన అనిల్ రావిపూడి, ఈసారి కూడా అదే సెంటిమెంట్‌ను రిపీట్ చేయాలని భావిస్తున్నారు. పక్కా ప్రణాళికతో అక్టోబర్ నాటికే ఈ భారీ మల్టీస్టారర్ షూటింగ్ మొత్తాన్ని పూర్తి చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఆ తర్వాత శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ముగించి, సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Published : 
  • 29 July 2026, 4:10 PM IST