Sania Mirza: సానియాతో స్మిత.. స్మితాకు సానియా రంజాన్ ధావత్‌.. ఏం గిఫ్ట్ ఇచ్చిందో తెలుసా..

తన జాబ్‌కు తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రజలకు అభిమానులకు దగ్గర ఉన్నారు. ఈ క్రమంలో రంజాన్‌ సందర్భంగా టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జాతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు స్మిత.

Post Published By: narender Thiru
Updated : 11 April 2024, 4:56 PM IST

Sania Mirza: తెలంగాణలో దాదాపు సెలబ్రెటీ హోదా ఉన్న ఐఏఎస్‌ అధికారి స్మితా సబర్వాల్‌. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆమె వర్కింగ్‌ స్టైల్‌, కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తరువాత ఆమెపై వచ్చిన విమర్శలు ఆమెను ఎప్పుడూ వార్తల్లో ఉండేలా చేశాయి. ఎన్ని విమర్శలు వచ్చిన తన పని తాను చేసుకుంటూ వెళ్లారే తప్ప ఎప్పుడు ఈ విషయాల మీద కామెంట్‌ చేయలేదు స్మిత.

Elon Musk: ఇండియాకి ఎలాన్ మస్క్.. టెస్లా కార్ల తయారీ ఇక్కడే..

తన జాబ్‌కు తన జీవితానికి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ.. ప్రజలకు అభిమానులకు దగ్గర ఉన్నారు. ఈ క్రమంలో రంజాన్‌ సందర్భంగా టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జాతో దిగిన ఫొటోను షేర్‌ చేశారు స్మిత. రంజాన్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో స్మితా, సానియా మీర్జా కలుసుకున్నారు. చాలా సేపు ఇద్దరూ మాట్లాడుకున్నారు. కలిసి భోజనం కూడా చేశారు. ఈ ఫొటోలను స్మిత తన ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ప్రొఫైల్స్‌లో షేర్‌ చేశారు. తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సానియా మీర్జాను తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా కేసీఆర్‌ ప్రకటించారు. అప్పుడు స్మిత కూడా సీఎం కార్యాలయంలో కీలక అధికారిగా ఉన్నారు.

అప్పటి నుంచే సానియాకు స్మితాకు మంచి స్నేహం ఉంది. సానియాను బ్రాండ్‌ అంబాసిడర్‌గా పెట్టడంపై అప్పట్లో ఓ చిన్నపాటి విమర్శల యుద్ధం నడిచినా అదంతా వేరే స్టోరీ. కానీ అనుకోకుడా ఈ ఇద్దరు పాత మిత్రులు రంజాన్‌ వేడుకల్లో కలుసుకోవడం ఆసక్తిగా మారింది. వీళ్లిదరినీ ఒకే ఫ్రేమ్‌లో చూసిన మ్యూచువల్‌ ఫ్యాన్స్‌ తెగ ఖుషీ అవుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Smita Sabharwal (@smita_sabharwal1)

Published : 
  • 11 April 2024, 4:56 PM IST