తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల కమిషన్ గట్టి షాక్ ఇచ్చింది. రాష్ట్రంలో రైతు బంధు నిధుల పంపిణీకి రెండు రోజుల క్రితం అనమతి ఇచ్చిన ఈసీ.. ఇప్పుడు ఆ అనుమతిని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున రైతుబంధు నిధులకు బ్రేక్ వేసినట్టు తెలిపింది. రైతుల ఖాతాల్లో నిధులు వేసేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ కు విజ్ఞప్తి చేసింది. ఇది గతం నుంచీ కొనసాగుతున్న ప్రభుత్వ పథకం కాబట్టి.. అభ్యంతరం పెట్టవద్దని కోరింది. దాంతో నిధుల విడుదలకు అనుమతి ఇచ్చింది.

Shock to BRS Sarkar Rythu Bandhu distribution stopped.. EC permissions withdrawn