బాలాసోర్ తరహాలోనే.. విజయనగరం ఘోర రైలు ప్రమాదం..

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు.

Post Published By: Suresh Dialtelugu
Updated : 30 October 2023, 12:51 PM IST

ఆంధ్రప్రదేశ్ లో విజయనగరం లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విశాఖ నుంచి పలాస రైలు సాయంత్రం 5:45 గంటలకు విజయనగరం వైపు బయలుదేరింది. అదే ట్రాక్ పై వెనుక విశాఖ రాయగడ ప్యాసింజర్ 6 గంటలకు బయలుదేరుతుంది. ముందు వెల్లిన పలాస రైలుకు సిగ్నల్ సమస్య తలెత్తడంతో కంటకపల్లి నుంచి పలాస రైలు చాలా నెమ్మదిగా ట్రాక్ పై కదులుతుంది అని ప్రయాణికులు చెప్తున్నారు. ఈ అదే సమయంలో వెనుక నుంచి రైలు ఢీకొన్నట్లు రైలు ప్రయాణికులు వివరించారు.రెండు రైళ్లలో కలిపి దాదాపు 1400 మంది ప్రయాణికులున్నట్లు సమాచారం. 17 గంటలకు పైగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఈ ప్రమాదం లో మృతుల సంఖ్య 14 మృతి, 100 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించింది ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ ఘటన పట్ల సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోడీ ఆరా తీస్తున్నారు.

ప్రమాద ఘటనపై హెల్ప్ లైన్‌ నంబర్లు..

  • హెల్ప్ లైన్లు     : 0891 2746330, 0891 2744619
  • గూడూరు హెల్ప్ లైన్ నంబర్‌   : 9494178434
  • ఏలూరు హెల్ప్ లైన్ నంబర్‌    : 0881-2232267
  • రాజమండ్రి హెల్ప్ లైన్ నంబర్‌  : 08854-252172
  • హెల్ప్ లైన్లు   : 81060 53051,  8106053052,  8500041670,  8500041671
  • రైల్వే హెల్ప్ లైన్లు  : 83003 83004,  85005 85006
  • వాల్తేరు హెల్ప్ లైన్ నంబర్‌      : 0891- 2885914
  • అనకాపల్లి హెల్ప్ లైన్ నంబర్‌    : 08924221698
  • భువనేశ్వర్‌ హెల్ప్ లైన్లు   : 0674-2301625,  2301525,  2303069
  • భువనేశ్వర్‌   : 06742301625, 06742301525, 06742303060, 06742303729 
  • వాల్తేరు టెస్ట్‌ రూం  : 89780 80805
  • సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ : 89780 80815
  • వాల్తేరు డివిజన్‌    : 08942286245, 08942286213
  • అలమండ, కంటకాపల్లి   : 89780 81960
  • విజయనగరం  : 08922221206, 08922221202, 89780 80006
  • శ్రీకాకుళం రోడ్డు   : 08942286213, 08922286245
  • ఏలూరు    : 08812232267
  • సామర్లకోట : 08842327010
  • రాజమహేంద్రవరం    : 08832420541
  • తుని     : 08854252172

దారి మళ్లించిన రైళ్లు ఇవే..

  • బరౌనీ కోయంబత్తూరు మధ్య నడిచే రైలును తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లారా, విజయవాడ మీదుగా మళ్లింపు
  • నగర్ ఎర్నాకుళం రైలును గొట్లం, తిల్లినగర్, నాగ్ పూర్, విజయవాడ మీదుగా మళ్లింపు
  • భువనేశ్వర్ ముంబై మధ్య నడిచే రైలును రద్దు చేశారు.
  • పూరి తిరుపతి మధ్య నడిచే రైలును బాలుగావ్ వరకు మళ్లింపు
  • ముంబై భువనేశ్వర్ మధ్య నడిచే రైలులు విశాఖ పట్నం వరకే నడుపుతారు.
  • భువనేశ్వర్ ముంబై రైలును విజయనగరం, తిత్తినగర్, రాంచీ, నాగ్ పూర్, కాజీపేట మీదుగా మళ్లింపు
  • హౌరా సికింద్రాబాద్ రైలును విజయనగరం తల్లిఘర్ రాంచీ, నాగ్ పూర్ కాజీపేట మీదుగా మళ్లింపు
  • బెంగుళూరు రైలును విజయనగరం, తిల్లిఘర్, రాంచీ, నాగ్ పూర్, బల్లార్షా, విజయవాడ మీదుగా మళ్లింపు

ఈ ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను అధికారులు రద్దు చేశారు.

రద్దయిన రైళ్లు..

  • కోర్బా – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (18517) ,
  • పారాదీప్ – విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్‌ (22809)
  • రాయగడ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08503)
  • పలాస – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08531)
  • విశాఖపట్నం – గుణుపుర్ ప్యాసింజర్ స్పెషల్ (08522)
  • గుణుపుర్ – విశాఖపట్నం ప్యాసింజర్ స్పెషల్ (08521)
  • విజయనగరం – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07469)
  • విజయవాడ – విశాఖపట్నం రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ (12718)
  • విశాఖ – విజయవాడ రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ (12717)
  • గుంటూరు – విశాఖ సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ (12739)
  • కాకినాడ – విశాఖ మెమూ ఎక్స్‌ప్రెస్‌ (17267)
  • విశాఖ – కాకినాడ మెమూ ఎక్స్‌ప్రెస్‌ (17268)
  • రాజమండ్రి – విశాఖపట్నం మెమూ స్పెషల్ (07466)
  • విశాఖపట్నం – రాజమండ్రి మెమూ స్పెషల్ (07467)
  • కోరాపుట్ – విశాఖపట్నం స్పెషల్ (08545)
  • విశాఖపట్నం – కోరాపుట్ స్పెషల్ (08546)
  • పలాస – విశాఖపట్నం స్పెషల్ (08531)
  • చెన్నై – పూరి ఎక్స్‌ప్రెస్‌ (22860)
  • రాయగడ – గుంటూరు ఎక్స్‌ప్రెస్‌ (17244)

SURESH

Published : 
  • 30 October 2023, 12:51 PM IST