YSRCP LIST: వైసీపీ ఆరో జాబితా విడుదల.. పది మంది ఇంచార్జిల నియామకం..

ఇంచార్జిలకు సంబంధించి ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

Post Published By: narender Thiru
Updated : 2 February 2024, 9:17 PM IST

YSRCP LIST: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ.. నియోజకవర్గాలకు ఇంచార్జిలను నియమిస్తున్న సంగతి తెలిసిందే. ఇంచార్జిలకు సంబంధించి ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించిన వైసీపీ అధిష్టానం.. తాజాగా ఆరో జాబితా విడుదల చేసింది. శుక్రవారం సాయంత్రం ఆరో జాబితాను వైసీపీ విడుదల చేసింది. 6 అసెంబ్లీ స్థానాలు, 4 పార్లమెంట్ స్థానాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ జాబితా విడుదల చేసింది.

పార్లమెంట్ స్థానాలు
రాజమండ్రి (ఎంపీ) - గూడూరి శ్రీనివాస్‌
నర్సాపూరం (ఎంపీ) - ఉమాబాల
గుంటూరు (ఎంపీ) - ఉమ్మారెడ్డి రమణ
చిత్తూరు (ఎంపీ) - రెడ్డప్ప

అసెంబ్లీ స్థానాలు
మైలవరం - సర్నాల తిరుపతిరావు యాదవ్‌
మార్కాపురం - అన్నా రాంబాబు
గిద్దలూరు - నాగార్జునరెడ్డి
నెల్లూరు సిటీ - ఎండీ ఖలీల్‌
గంగాధర నెల్లూరు - నారాయణస్వామి
ఎమ్మిగనూరు - బుట్టా రేణుక

 

Published : 
  • 2 February 2024, 9:17 PM IST