సినిమా పిచ్చి ఉన్న ప్రతీ ఒక్కరికీ మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే చాలు.. ఒక రకమైన జోష్ వచ్చేస్తుంది. తెరపై ఆయన చూపించే ఎనర్జీ, ఇచ్చే డైలాగ్ డెలివరీ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలతో దూసుకెళ్తున్న రవితేజ, త్వరలోనే ఒక అదిరిపోయే మల్టీస్టారర్ సినిమాతో మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన సమాచారం ఇప్పుడు టాలీవుడ్ నాడి తెలిసిన వర్గాల్లో బాగా హల్‌చల్ చేస్తోంది.అదేంటంటే.. ఈ సినిమాలో రవితేజ సరసన హీరోయిన్‌గా హాట్ బ్యూటీ డింపుల్ హయతి నటించబోతోందట! ఒకవేళ ఇదే నిజమైతే, వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న మూడో సినిమా ఇది అవుతుంది. గతంలో రవితేజ - డింపుల్ హయతి కలసి నటించిన సినిమాలు ప్రేక్షకులను బాగానే అలరించాయి.
మొదటిసారిగా వీళ్లిద్దరూ ‘ఖిలాడి’ సినిమాలో జంటగా కనిపించారు. ఆ సినిమాలో వీరిద్దరి మధ్య వచ్చిన పాటలు, కెమిస్ట్రీ అప్పట్లో మంచి టాక్ తెచ్చుకున్నాయి. దాని తర్వాత ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే సినిమాలోనూ ఈ జంట సందడి చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి ఈ హిట్ కాంబో రిపీట్ కాబోతోందన్నమాట. ఈ సినిమా కేవలం రవితేజ ఒక్కరిదే అనుకుంటే పొరపాటే! ఇది ఒక పక్కా మల్టీస్టారర్ సినిమా. రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ వంటి డిఫరెంట్ అండ్ ఫన్నీ సినిమాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ హసిత్ గోలి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన మార్క్ కామెడీ, ట్విస్టులు ఈ సినిమాలో భారీ స్థాయిలో ఉండబోతున్నాయట. ఈ సినిమాలో రవితేజతో పాటు ఇంకో హీరోగా యంగ్ అండ్ వర్సటైల్ నటుడు శ్రీవిష్ణు కనిపించబోతున్నారు. శ్రీవిష్ణు కామెడీ టైమింగ్, నేచురల్ నటన గురించి మనందరికీ తెలిసిందే. రవితేజ మాస్ ఎనర్జీకి శ్రీవిష్ణు టైమింగ్ తోడైతే థియేటర్లలో నవ్వుల పువ్వులు పూయడం ఖాయం. ఈ బిగ్ ప్రాజెక్ట్‌ను టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.
ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటంటే.. రవితేజ పక్కన డింపుల్ హయతి ఓకే అయిపోయింది సరే, మరి శ్రీవిష్ణు పక్కన హీరోయిన్ ఎవరు? అని. దానికోసం చిత్రబృందం ఒక అగ్ర కథానాయికను సంప్రదించిందట. ఆమే మన 'బుట్టబొమ్మ' పూజా హెగ్డే! శ్రీవిష్ణుకి జోడీగా పూజా హెగ్డే నటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పూజా కూడా ఈ ప్రాజెక్ట్‌కి సై అంటే.. ఈ సినిమా స్టార్ కాస్టింగ్ మరింత మెరిసిపోవడం ఖాయం. రవితేజ, శ్రీవిష్ణు, డింపుల్, పూజా హెగ్డే.. ఇలాంటి క్రేజీ కాంబోను ఒకే తెరపై చూడటం నిజంగా సినీ అభిమానులకు కనుల పండగే! ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, స్క్రిప్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అన్ని కుదిరితే వచ్చే నెలలోనే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అధికారికంగా పట్టాలెక్కనుంది.మాస్ మహారాజా స్పీడ్, శ్రీవిష్ణు మార్క్ నటన, హసిత్ గోలి విభిన్నమైన కథ, దిల్ రాజు ప్రొడక్షన్ వాల్యూస్.. ఇవన్నీ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర బొమ్మ హిట్ అవ్వడం ఖాయం అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.