Uppal: హైదరాబాద్ సిగలో మరో నగ.. ఉప్పల్ కూడలి వద్ద స్కై వాక్ ఏర్పాటు..

హైదరాబాద్ : ఉప్పల్ రింగ్ రోడ్డులో పాదచారుల కష్టాలకు చెక్ చెక్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం స్కైవాక్ ఏర్పాటు చేసింది. దీనిని సోమవారం మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మినిస్టర్ కేటీఆర్ హాజరయ్యారు. దాదాపు రూ. 25 కోట్లతో స్కైవాక్ బ్రిడ్జి నిర్మించారు. ఎక్కడా క్రింద నుంచి ట్రాఫిక్ నడుమ రోడ్డు దాటే అవసరం లేకుండా బ్రిడ్జ్ పై నుంచి వెళ్లొచ్చు. ఈ స్కై వాక్ పొడవు 665 మీటర్లు.. వెడల్పు 4 మీటర్లు కాగా 6 మీటర్ల ఎత్తులో దీనిని కట్టడం జరిగింది. బస్ స్టాప్, మోట్రోకు అనుసంధానం చేస్తూ ఇందులో మొత్తం 8 లిఫ్టులు, 4 ఎస్కలేటర్స్, 6 చోట్ల మెట్ల సౌకర్యం ఏర్పాటు చేశారు.

Post Published By: Srikar Creator
Updated : 26 June 2023, 3:45 PM IST
1 / 15 \"Zoom\"ఉప్పల్ వద్ద పాదచారుల కోసం ఏర్పాటు చేసిన స్కై వాక్
2 / 15 \"Zoom\"ట్రాఫిక్ రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేశారు
3 / 15 \"Zoom\"రాత్రి పూట రంగురంగుల విద్యుత్ కాంతులతో అలంకరించారు
4 / 15 \"Zoom\"దాదాపు కొన్ని నెలల నుంచి దీనిని నిర్మిస్తూ వచ్చారు
5 / 15 \"Zoom\"వర్షం పడితే లోనికి నీరు పడకుండా పై కప్పు ఏర్పాటు చేశారు
6 / 15 \"Zoom\"ఉప్పల్ మొట్రోకి అనుసంధానం చేస్తూ నిర్మించారు
7 / 15 \"Zoom\"సూర్యాస్తమయం వేళ స్కై వాక్ చిత్రం
8 / 15 \"Zoom\"ఎనిమిది లిఫ్ట్ లు ఏర్పాటు చేశారు.
9 / 15 \"Zoom\"నడిచేందుకు విశాలమైన మార్గం
10 / 15 \"Zoom\"చుట్టూ పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా నిర్మించారు
11 / 15 \"Zoom\"ప్రయాణీకులు కూర్చునేందుకు వీలుగా బల్లలు ఏర్పాటు
12 / 15 \"Zoom\"అంతరిక్షం నుంచి ఇలా కనిపిస్తుంది
13 / 15 \"Zoom\"నాలుగు ఎస్కలేటర్లతో ఈ నిర్మాణాన్ని చేపట్టారు
14 / 15 \"Zoom\"మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేశారు.
15 / 15 \"Zoom\"మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరై నగరాన్ని సర్వంగ సుందరంగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ దేఅని కొనియాడారు

Published : 
  • 26 June 2023, 3:45 PM IST