Fire Accident: మంటల్లో దగ్ధమైన ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ బోగీలు.. (ఫోటోలు)

హౌడా నుంచి సికింద్రాబాద్ వరకూ ప్రయాణించే ఫలక్నుమా ఎక్స్ ప్రెస్ లో తీవ్రమైన మంటలు చెలరేగాయి. దాదాపు ఆరు బోగీలకు మంటలు వ్యాపించాయి. ప్రయాణీకులు అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న లోకో పైలెట్ రైలును ఉన్నచోటే నిలిపి వేయడంతో ప్రయాణికులు క్రిందకు దిగేశారు. దీంతో ప్రాణ‎నష్టం సంభవిచలేదని రైల్వే అధికారులు తెలిపారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో చోటు చేసుకుంది.

Post Published By: Srikar Creator
Updated : 7 July 2023, 2:40 PM IST
1 / 12 \"Zoom\"ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే సిబ్బంది
2 / 12 \"Zoom\"మంటలు ఆర్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు
3 / 12 \"Zoom\"ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ షాట్ సర్క్యూట్ కి గురైంది
4 / 12 \"Zoom\"రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ తో  పాటూ స్థానిక పోలీసులు ప్రమాదస్థలికి చేరుకున్నారు
5 / 12 \"Zoom\"పూర్తిగా కాలి బూడిదైన బోగీలు
6 / 12 \"Zoom\"అప్రమత్తమైన లోకోపైలట్ రైలును అక్కడికక్కడే నిలిపివేశారు
7 / 12 \"Zoom\"ముందుగా ఎస్ 4, ఎస్ 5 బోగీల్లో మంటలు చెలరేగాయి
8 / 12 \"Zoom\"ఈ రెండు బోగీల కారణంగా వాటికి పక్కనున్న బోగీలకు మంటలు వ్యాపించాయి
9 / 12 \"Zoom\"నాలుగు బోగీలు పూర్తిగా దగ్ధమయ్యాయి
10 / 12 \"Zoom\"ప్రయాణీకులను సికింద్రాబాద్ చేర్చేందుకు ప్రత్యేక బస్సులతో పాటూ లోకమాన్య తిలక్ రైలును ఏర్పాటు చేశారు.
11 / 12 \"Zoom\"ప్రయాణీకుల లగేజీ మొత్తం మంటల్లో కాలి బూడిదవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
12 / 12 \"Zoom\"సమయానికి అందరూ అప్రమత్తం అవడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు

Published : 
  • 7 July 2023, 2:40 PM IST