ప్రపంచాన్నే శాసిస్తున్న అగ్రరాజ్యం అమెరికా.. ఇప్పుడు తన సొంత గోతిని తానే తవ్వుకుంటోంది. ఇరాన్ మీద యుద్ధం అంటే కేవలం క్షిపణుల పోరు అనుకుంటే పొరపాటే.. ఇది అమెరికా ఆర్థిక మూలాలను పిండేస్తున్న మహా యుద్ధం. నేటి లెక్కల ప్రకారం, అమెరికా ఈ యుద్ధం కోసం నిమిషానికి వందల కోట్లు తగలేస్తోంది. అగ్రరాజ్యపు అహంకారం ఎంతలా ఉందంటే.. ఇరాన్ పంపే లక్షల రూపాయల డ్రోన్లను ఆపడానికి, అమెరికా కోట్లాది రూపాయల క్షిపణులను వాడుతోంది. ఫలితం..? అమెరికా ఖజానాలో రంధ్రం పడింది. అసలు ఇప్పటివరకు అమెరికా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయింది..? వైట్ హౌస్ దాస్తున్న ఆ భయంకరమైన లెక్కలేంటి? ఈ వీడియోలో కళ్లకు కట్టినట్లు చూద్దాం.
పెంటగాన్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా సగటున రోజుకు 1.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేస్తోంది. అంటే మన భారత కరెన్సీలో రోజుకు దాదాపు రూ.12,500 కోట్లు. కేవలం ఒకే నెలలో అమెరికా దాదాపు రూ.3.75 లక్షల కోట్లను కేవలం ఇంధనం, ఆయుధాలు మరియు సైనికుల నిర్వహణ కోసమే ఖర్చు చేసింది. అసలైన ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇరాన్ వాడుతున్న ఒక ఆత్మహుతి డ్రోన్ ధర కేవలం 20,000 డాలర్లు.. మన కరెన్సీలో 16 లక్షలు. కానీ దాన్ని గాల్లోనే పేల్చడానికి అమెరికా వాడుతున్న ఒకే ఒక్క 'SM-2' క్షిపణి ధర 2.1 మిలియన్ డాలర్లు మన కరెన్సీలో రూ.17 కోట్లు.
వీటిని అడ్డుకోవడానికి ఇప్పటివరకు అమెరికా దాదాపు 850కి పైగా టోమాహాక్ క్షిపణులను ప్రయోగించింది, వీటి మొత్తం విలువ అక్షరాలా రూ.28,050 కోట్లు. అంటే, ఇరాన్ చిన్న రాయి విసిరితే, అమెరికా దాన్ని ఆపడానికి వజ్రాన్ని అడ్డుపెడుతోంది. ఇరాన్ డ్రోన్లను ఆపడానికి వాడిన SM-2, SM-6 క్షిపణుల ఖర్చు దాదాపు రూ.15,000 కోట్లు. ఇరాన్ కేవలం రూ.15 లక్షల డ్రోన్లతో అమెరికాను ఇంత భారీ ఖర్చులోకి నెట్టింది. ఇలాంటి లాజిక్ లేని యుద్ధం వల్ల అమెరికా తన ఆయుధ నిల్వలను, డాలర్లను సముద్రం పాలు చేస్తోంది.
ఖర్చు ఒకెత్తయితే, యుద్ధ రంగంలో అమెరికా కోల్పోతున్న ఆస్తులు మరో ఎత్తు. ఇరాన్ జరిపిన 'టార్గెటెడ్ అటాక్స్' లో అమెరికాకు చెందిన అత్యంత ఖరీదైన MQ-9 రీపర్ డ్రోన్లు నేలమట్టమయ్యాయి. ఒక్కో డ్రోన్ ధర సుమారు రూ.250 కోట్లు. ఇప్పటివరకు 5 కి పైగా ఇలాంటి డ్రోన్లను అమెరికా కోల్పోయింది. అంతేకాదు, ఇరాన్ క్షిపణులు అమెరికా విమానవాహక నౌక పక్కనే పడటంతో, వాటి రేడార్ వ్యవస్థలు మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్ దెబ్బతిన్నాయి. వీటిని రిపేర్ చేయడానికే వేల కోట్లు ఖర్చవుతున్నాయి.
ఒక్క మాటలో చెప్పాలంటే, అమెరికా సంవత్సరాల తరబడి నిర్మించుకున్న టెక్నాలజీ సామ్రాజ్యం.. ఇరాన్ 'న్యూ స్టాక్' క్షిపణుల ముందు బూడిదవుతోంది. ఈ ఆస్తుల నష్టం విలువ ఇప్పటికే మన కరెన్సీలో రూ. 25,000 కోట్లు దాటిందని అంచనా. ఇక యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు కేవలం సైనిక కార్యకలాపాల కోసమే అమెరికా సుమారు రూ.2.95 లక్షల కోట్లు.. అంటే అమెరికా కరెన్సీలో 35.5 బిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసినట్లు అంచనా. పర్షియన్ గల్ఫ్ మరియు ఎర్ర సముద్రంలో మోహరించిన యుద్ధ నౌకల ఇంధనం, ఆహారం మరియు సిబ్బంది భత్యాల కోసం రోజుకు రూ. 2,000 కోట్లు ఖర్చవుతోంది.
ఈ భారీ వ్యయం అమెరికా రక్షణ బడ్జెట్‌పై ముందెన్నడూ లేని విధంగా ఒత్తిడిని పెంచుతోంది. ముఖ్యంగా ఆయుధాల వినియోగం విషయంలో అమెరికాకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. కేవలం నగదు రూపంలోనే కాకుండా, సైనిక ఆస్తుల పరంగా కూడా అమెరికాకు భారీ నష్టం వాటిల్లింది. అలాగే యుద్ధ నౌకల నిర్వహణ, ఇంధనం మరియు రేడార్ వ్యవస్థల రిపేర్ల కోసం అదనంగా రూ.5,000 కోట్లు ఖర్చయ్యాయి. ఈ యుద్ధ విమానాలు, నౌకలు గాల్లో లేదా సముద్రంలో గడిపే ప్రతి గంటకు లక్షలాది రూపాయల నిర్వహణ వ్యయం భరించాల్సి వస్తోంది. ఈ మొత్తం నష్టం సుమారు రూ.23,240 కోట్లు దాటిపోయింది.
యుద్ధ రంగం వెలుపల కూడా అమెరికా ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమవుతోంది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు బ్యారెల్‌కు 120 డాలర్లు దాటడంతో అమెరికా అంతర్గత రవాణాపై రూ. 40,000 కోట్ల అదనపు భారం పడింది. పరిస్థితి ఎంత విషమించిందంటే, తరిగిపోయిన ఆయుధాలను భర్తీ చేయడానికి పెంటగాన్ ప్రభుత్వం నుండి అదనంగా రూ.16.6 లక్షల కోట్ల అంటే.. 200 డాలర్ల అత్యవసర నిధులను కోరింది. నిమిషానికి సుమారు రూ.8.5 కోట్లు తగలేస్తున్న ఈ యుద్ధం నుంచి త్వరగా తప్పుకోకపోతే, అమెరికా ఆర్థికంగా కోలుకోవడం అసాధ్యమని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
యుద్ధం కేవలం యుద్ధ రంగంలోనే కాదు, అమెరికా గుండెకాయ లాంటి 'వాల్ స్ట్రీట్' లో కూడా జరుగుతోంది. యుద్ధం మొదలైనప్పటి నుంచి అమెరికా స్టాక్ మార్కెట్ లో పెట్టుబడిదారులు సుమారు 2 ట్రిలియన్ డాలర్లు అంటే.. రూ.160 లక్షల కోట్ల సంపదను కోల్పోయారు. అమెరికా ప్రజల పెన్షన్ ఫండ్స్, సేవింగ్స్ అన్నీ ఆవిరైపోతున్నాయి. మరోవైపు, ఇరాన్ హార్ముజ్ జలసంధిని పాక్షికంగా మూసివేయడంతో, ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు మండిపోతున్నాయి. అమెరికాలో గ్యాసోలిన్ ధరలు ఆకాశాన్ని తాకడంతో సామాన్య అమెరికన్ రోడ్లపైకి వస్తున్నాడు. ఒకపక్క యుద్ధం కోసం అప్పులు చేయడం, మరోపక్క ద్రవ్యోల్బణం పెరగడం.. అమెరికాను ఆర్థిక దివాలా దిశగా నెట్టేస్తున్నాయి.