కొద్ది రోజుల్లో ఏపీ క్యాబినెట్ ని ప్రక్షాళన చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇద్దరు ముగ్గురు పాత మంత్రులను తొలగించి , కొత్త వాళ్లకు చోటు కల్పించబోతున్నారు.నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి క్యాబినెట్ విస్తరణలో చోటు ఖాయమని పక్కాగా తెలిసింది.నిజానికి ప్రశాంతికి 2024లో కూటమి సర్కారు ఏర్పడినప్పుడే మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే జిల్లా, కులాల సమీకరణాల్లో అప్పట్లో ప్రశాంతి రెడ్డికి మంత్రి పదవి ఇవ్వలేకపోయారు చంద్రబాబు. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ లో సభ్యురాలిగా సభ్యురాలుగా నిర్మించారు. ఇటీవలే టిడిపి పోలీస్ బ్యూరోలో కూడా వేమిరెడ్డి ప్రశాంతి చోటు సంపాదించారు. నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి భార్య ప్రశాంతి రెడ్డి.
వైసిపి హయాంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన ప్రభాకర్ రెడ్డి ఆ తర్వాత జగన్ తో విభేదించి భార్యతో కలిసి టిడిపిలో చేరారు.2024 ఎన్నికల్లో వేమిరెడ్డికి నెల్లూరు ఎంపీ టికెట్, ఆయన భార్యా ప్రశాంతికి కోవూరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. వేల కోట్ల రూపాయలకు అధిపతి అయిన వేమిరెడ్డి తెలుగుదేశం పార్టీని, ఆర్థికంగా చాలా ఆదుకున్నారు. 20 24 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా ఖర్చు అంతా వేమిరెడ్డి దంపతులే భరించారు. నిజానికి మొన్న మే నెలలో టిడిపి మహానాడు వేమిరెడ్డి దంపతుల కోసమే నెల్లూరులో నిర్వహించాలని అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ అది ఆ తర్వాత రద్దయింది. టిడిపి మహానాడు ఖర్చు కూడా మొత్తం తామే భరిస్తామని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు పార్టీ అధిష్టానానికి హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే టికెట్ తో పాటు మంత్రి పదవి కూడా వేమిరెడ్డి ప్రశాంతికి ఇస్తామని ఎన్నికల ముందే చంద్రబాబు హామీ ఇచ్చి ఉన్నారు.
ఆలస్యంగా నైనా అది ఇప్పుడు పూర్తి చేస్తున్నారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ప్రశాంతి రెడ్డి మరదలవుతారు. చంద్రమోహన్ రెడ్డి సోదరుడు హర్షవర్ధన్ రెడ్డిని ఆమె మొదట వివాహం చేసుకున్నారు. హర్షవర్ధన్ రెడ్డి అకాల మరణంతో కొద్దికాలం తర్వాత ప్రశాంతి రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని పెళ్లాడారు.కోవూరు వైసిపి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి కూడా ప్రశాంతి రెడ్డికి బంధువే అవుతారు. మొన్నటి ఎన్నికల్లో ప్రశాంత్ రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పైనే గెలిచారు. వేమిరెడ్డి ప్రశాంతిని టార్గెట్ చేస్తూ ప్రసన్న కుమార్ రెడ్డి తరచూ వ్యంగంగా కామెంట్స్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైంది. గతంలో ప్రశాంతి రెడ్డిని విమర్శించినందుకు ఆమె అనుచరులు ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడులు కూడా చేసి ఇల్లు ధ్వంసం చేశారు. ఆర్థికంగా బలమైన శక్తి కావడంతో వేమిరెడ్డి దంపతులు నెల్లూరు జిల్లాలో బలంగానే పాతుకు పోయారు. ముఖ్యంగా టిడిపిలో లోకేష్ కి ఈ కుటుంబం బాగా దగ్గరయింది.
ఈ సమీకరణాలన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతి రెడ్డికి పొలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించారు . పార్టీలో చేరి రెండేళ్లు కాకుండానే... ప్రశాంతిని ఏకంగా పోలీట్ బ్యూరో సభ్యురాలు చేయడంపై బహిరంగంగానే విమర్శలు వచ్చాయి. పార్టీలో 30 .....40 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళని కాదని డబ్బులు కక్కుర్తి పడి వేమిరెడ్డి కుటుంబానికి పెద్దపీట వేస్తున్నారని సీనియర్ నేతలు చాలామంది తెరవెనక మాట్లాడుకున్నారు. అయితే ఈ విమర్శలను చంద్రబాబు లోకేష్ ఇద్దరు పెద్దగా లెక్క చేయలేదు. త్వరలో క్యాబినెట్ ఎక్స్పాన్షన్ జరిగితే దాన్లో కూడా ప్రశాంతికి చోటు ఇస్తే మరికొన్ని విమర్శలు తప్పవు. కానీ పార్టీని అన్ని రకాలుగా ఆదుకుంటున్న వేమిరెడ్డి దంపతులకు కచ్చితంగా సముచిత స్థానం ఇవ్వాల్సిందేనని లోకేష్ బలంగా ఉన్నారు. ఏమి రెడ్డి ప్రశాంతి మంత్రి అయితే టిడిపిలో చేరిన రెండేళ్లలో ఎమ్మెల్యే, టీటీడీ సభ్యురాలు, మంత్రి పదవులు దక్కించుకున్న ఏకైక నేతగా రికార్డు స్థాపిస్తారు.