బ్రేకింగ్: పరారీలో వర్మ

గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు. విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు.

Post Published By: Vencateshg
Updated : 25 November 2024, 12:10 PM IST

గత కొన్నాళ్ళుగా సోషల్ మీడియాలో చెలరేగిపోతున్న సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు. విచారణకు రాకుండా తప్పించుకుని తిరుగుతున్న రాంగోపాల్ వర్మను అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. సినిమా షూటింగ్ పేరుతో విచారణకు హాజరు కాని వర్మను అరెస్ట్ చేయడానికి హైదరాబాద్ లోని ఆయన ఇంటికి చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు.

నేడు మద్దిపాడు పోలీస్ స్టేషన్ కి విచారణకు హాజరు కావలసిన రాంగోపాల్ వర్మ... విచారణకు రాలేను అని సమాధానం ఇచ్చాడు. ఇప్పటికే ఒకసారి విచారణకు డుమ్మా కొట్టిన ఆర్జీవి... తన లాయర్ ను పంపించాడు. నేడు మరోసారి విచారణను తప్పించుకునే ప్రయత్నం చేయడంతో పోలీసులు అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు. తన లాయర్ తో విచారణకు హాజరు కాలేనంటూ ఏపి పోలీసులకు సమాచారం ఇవ్వడం పట్ల పోలీసులు సీరియస్ అయ్యారు. విచారణకు గైర్హాజరు కావడంతో అరెస్టుకు రంగం సిద్ధం చేసారు.

Published : 
  • 25 November 2024, 12:10 PM IST