Top story: బండ్లన్నా…! మజాకా.? కూతురు పెళ్లి ద్వారా తన దమ్మేంటో చూపించిన బండ్ల గణేష్..అనుకున్నది సాధించిన బండ్ల గణేష్..!

కూతురు పెళ్లి అంటే అందరూ ఘనంగా చేయాలనుకుంటారు. తన తాహతుకు తగినట్లు చేయాలనుకుంటారు. బండ్ల ఇస్ డిఫరెంట్. కూతురు పెళ్లిని... ఇజ్జత్క సవాల్ గా తీసుకున్నాడు.వందమంది ప్రశ్నలకు తన కూతురు పెళ్లితోనే సమాధానం చెప్పాలనుకున్నాడు.

Post Published By: dialnews
Updated : 19 August 2026, 1:18 PM IST

కూతురు పెళ్లి అంటే అందరూ ఘనంగా చేయాలనుకుంటారు. తన తాహతుకు తగినట్లు చేయాలనుకుంటారు. బండ్ల ఇస్ డిఫరెంట్. కూతురు పెళ్లిని... ఇజ్జత్క సవాల్ గా తీసుకున్నాడు.వందమంది ప్రశ్నలకు తన కూతురు పెళ్లితోనే సమాధానం చెప్పాలనుకున్నాడు. తనని వెక్కిరించిన వాళ్ళకి... గేలి చేసిన వాళ్ళకి కూతురు పెళ్లి తోనే ఘాటుగా రిప్లై ఇచ్చాడు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నాయకులు. సినిమా ఇండస్ట్రీ పెద్దలు.... మొత్తం అందరినీ కుమార్తె వివాహ వేదికపై నిలబెట్టి... ఔరా బండ్ల మామూలోడు కాదు అని అనిపించాడు.

బండ్ల గణేష్ ని సినిమా ఇండస్ట్రీలోనూ, పొలిటికల్ సర్కిల్స్ లోనూ ఒక నాన్ సీరియస్ పర్సనాలిటీగా ..చూస్తారు. గణేష్ పబ్లిసిటీ కోసం ఎంతకైనా తెగిస్తాడని.... తన పని కోసం, తన అవసరానికి ఏదైనా చేస్తాడని రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు. బండ్ల గణేష్ ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. కోరి వివాదాల్లో దిగడం.... ఆ వివాదాల ద్వారా ఆర్థికంగా సంపాదించడం, లేదా పబ్లిసిటీ అయినా తెచ్చుకోవడం బండ్ల స్ట్రాటజీ. ఏ రోటి కాడ ఆ పాట పాడడం .... అనేది గణేష్ నిత్యం చేసేదే. పవన్ కళ్యాణ్ ని ఈశ్వర పరమేశ్వర అని పొగిడిన ...అది బండ్లకే సాధ్యం. కొన్నాళ్లు బండ్ల వ్యవహార శైలిని ఎంజాయ్ చేసిన పవన్ ఆ తర్వాత పూర్తిగా పక్కన పెట్టేసాడు. కొన్నాళ్ళు కాంగ్రెస్లో తిరిగిన గణేష్ 2018లో కాంగ్రెస్ గెలవకపోతే బ్లేడుతో కంఠం కోసుకుంటానని ప్రతిజ్ఞ చేసి ఆ తర్వాత తూచ్ అన్నాడు.

అవతల వాడు తనకి పనికొస్తాడు అని అనిపిస్తే చాలు... డైవ్ కొట్టి కాళ్లు పట్టేస్తాడు. ఇదేంటి అని మీరు ప్రశ్నించారు అనుకోండి.... బతకడానికి ఎవడో ఒకడు కాళ్ళు పట్టుకుంటే తప్పేంటి...? నేను ఎవరి కి హాని చేయడం లేదు కదా అని దబాఇస్తాడు. అది కూడా కొంత కరెక్టే. కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నించి విఫలమై ఆ తర్వాత గేర్ మార్చాడు.2023లో చంద్రబాబు నాయుడు అరెస్టు అయినప్పుడు.... కష్టాల్లో ఉన్న నారా కుటుంబానికి ఊహించని విధంగా దగ్గరయ్యాడు. క్యాస్ట్ కూడా అడ్వాంటేజ్ అయింది. చంద్రబాబు కోసం భారీ ప్రసంగాలు, ధర్నాలు చేశాడు. దానికి బాబు గారి దృష్టిలో పడ్డాడు. అధికారంలోకి రాగానే చంద్రబాబు కూడా గణేష్ ని ఆదుకున్నారట. ముఖ్యంగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి.... ఇలాంటి వాడు కూడా మనకి ఒకడు ఒకటి కావాలి అని గణేష్ ని దగ్గరికి తీశారు. ఎందుకో తెలియదు కానీ లోకేష్ మాత్రమే బండ్ల గణేష్ కి కాస్త దూరంగా ఉన్నాడు.

చంద్రబాబు జైలు నుంచి విడుదలయితే పాదయాత్ర చేసుకుంటూ తిరుమల వస్తానని మొక్కుకున్నాడట బండ్ల. తిరుమల వెళ్లి మొక్కు తీర్చుకున్నాడు కూడా. దాంతో చంద్రబాబు నాయుడు అండ్ ఫ్యామిలీ పూర్తిగా ఫ్లాట్ అయిపోయారు.ఏకంగా ముఖ్యమంత్రి బండ్ల గణేష్ ని దగ్గరకి తీయడంతో టిడిపి నేతలు మొత్తం బండ్ల కి క్లోజ్ అయిపోయారు. చెక్ బౌన్స్ కేసులు, ఆస్తుల వివాదాలు, అప్పులు ఇలా ఎన్ని గొడవలు ఉన్నా కూడా.... ప్రమాదకారి కాదు కదా అని పొలిటికల్ సర్కిల్స్లో కూడా బండ్లతో సర్దుకుపోతూ ఉంటారు. బండ్లతో అడ్వాంటేజ్ కూడా ఉంది. రకరకాల సర్కిల్స్లో తిరుగుతాడు కనుక మన గురించి పాజిటివ్ ప్రమోషన్ కూడా చేస్తాడు. ఓ పక్కన పడి ఉంటాడు. ఉండనీయరాదా... అనుకునే వాళ్ళు లేకపోలేదు

ఇంత గందరగోళం మధ్య.... తన కూతురు పెళ్లితోనే సొసైటీలో జనానికి తన శక్తిసామర్ధ్యాలు ఏంటో తెలియాలని.... తద్వారా పాలిటిక్స్ లో, సినిమా ఇండస్ట్రీలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాలని గణేష్ పక్కగా ప్లాన్ చేసుకున్నాడు. తాను ఏంటో నిరూపించుకున్నాడు కూడా. నిశ్చయ తాంబూలం ఫంక్షన్ దగ్గర్నుంచి , పెళ్లి కార్డులు పంచడం... సంగీత్, హల్ది ఇలా ప్రతి ఫంక్షన్ ని సూపర్ పబ్లిసిటీతో జనంలోకి తీసుకెళ్లగలిగాడు. మనం బండ్ల కుమార్తె పెళ్లికి వెళ్ళకపోతే... ఏదో మిస్ అయిపోతాం అనే ఫీల్ క్రియేట్ చేశాడు. పెళ్లి ఆదివారం, సెలవు రోజు కావడంతో అందరూ హాజరు కావడానికి కూడా వీలైంది.

పెళ్లి ద్వారా బండ్ల లక్ష్యం ఏదైనాప్పటికీ.... ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల నేతలు, ముఖ్యంగా టిడిపి నేతలు హైదరాబాద్ జేఆర్సి లో జరిగిన పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. యువ హీరోల్లో అఖిల్ మాత్రమే గణేష్ కుమార్తె వివాహానికి హాజరయ్యాడు. మిగిలిన హీరో లు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్న.. కూడా ఈ పెళ్లికి హాజరవ్వడం ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ.. తనని తక్కువగా చూసే చాలామందికి , తన కుమార్తె పెళ్లి ద్వారా ఇదిరా నా సత్తా అని చూపించాడు బండ్ల గణేష్. నిజంగానే బండ్ల ప్లాన్ వర్కౌట్ అయితే.... రాబోయే రోజుల్లో ఏదో ఒక పొలిటికల్ పోస్టులో సెట్ అయిపోతాడు. ఒకటో రెండో పెద్ద సినిమాలు కూడా తీసిన ఆశ్చర్యం లేదు. హ్యాట్సాఫ్ టు బండ్ల.

Published : 
  • 19 August 2026, 1:18 PM IST