బ్రేకింగ్: టీడీపీ ఎమ్మెల్యే సస్పెండ్… పదవికి రాజీనామా…?

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే ఆదిమూలం అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

Post Published By: Vencateshg
Updated : 5 September 2024, 2:04 PM IST

సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలంపై టీడీపీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎమ్మెల్యే ఆదిమూలం వీడియోల వ్యవహారాన్ని ముఖ్యమంత్రి దృష్టికి పార్టీ నేతలు తీసుకువెళ్ళారు. ఎమ్మెల్యే ఆదిమూలం అంశంపై తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదిమూలంను పార్టీ నుంచి సస్పెండ్ చేసారు.ఆయనతో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయించనున్నారు.

నివేదిక అనంతరం రిపోర్ట్ ను బట్టి చర్యలు తీసుకుంది పార్టీ అధిష్టానం. వీడియోస్ బయటకు వచ్చిన తర్వాత ఫోన్ పని చేస్తున్నప్పటికీ ఎమ్మెల్యే ఆన్సర్ చేయడం లేదు. అధిష్టానానికి తన మీద కుట్ర జరిగిందని చెప్పడానికి ఎమ్మెల్యే విజయవాడ వెళ్తున్నారని ఆయన అనుచరులు అంటున్నారు. నియోజకవర్గం లో పెత్తనం కోసం తనపై కుట్ర జరిగిందని ఎమ్మెల్యే అనుచరులు అంటున్నారు. మహిళల పట్ల ఎమ్మెల్యే అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణల నేపధ్యంలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. లైంగిక వేధింపులకు సంబంధించి వీడియోలు బయటకు వచ్చాయి. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న వీడియోలు బయటకు రావడంతో అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

Published : 
  • 5 September 2024, 2:04 PM IST