ఢిల్లీలో బిజీ బిజీగా బాబు, ఇదే షెడ్యూల్

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు... 6.15 గంటలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవుతారు.

Post Published By: Vencateshg
Updated : 7 October 2024, 5:49 PM IST

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. కాసేపటి క్రితం ప్రధానితో భేటీ అయిన చంద్రబాబు... 6.15 గంటలకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో భేటీ అవుతారు. అనంతరం రాత్రి 8గంటలకు ఎంపీలకు సిఎం చంద్రబాబు విందు ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఉదయం 11.30గంటలకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో చంద్రబాబు భేటీ కానున్నారు.

సాయంత్రం 4.30గంటలకు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం అవుతారు. 5.30గంటలకు హర్ దీప్ సింగ్ పూరిలతో భేటీ అయ్యే సూచనలు ఉన్నాయి. రేపు రాత్రి 8 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ కానున్న చంద్రబాబు... అనంతరం రాత్రి 11.15గంటలకు కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చంద్రబాబు భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇలా చంద్రబాబు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

Published : 
  • 7 October 2024, 5:49 PM IST