సజ్జలపై సిఐ సంచలన కామెంట్స్

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో విచారణకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరు అయ్యారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు.

Post Published By: Vencateshg
Updated : 17 October 2024, 6:10 PM IST

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడిలో విచారణకు వైసీపీ కీలక నేత సజ్జల రామకృష్ణా రెడ్డి హాజరు అయ్యారు. మంగళగిరి రూరల్ సీఐ శ్రీనివాసరావు సజ్జలను విచారించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం దాడికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం గత ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని విచారణకు పిలిపించడం జరిగిందన్నారు.

విచారణ సమయంలో పోలీసులకు సహకరించలేదని తెలిపారు. దాడికి నాకు సంబంధం లేదని సమాధానం చెబుతున్నారని సెల్ఫోన్ స్వాధీనం చేయడానికి కూడా నిరాకరించారని సిఐ వెల్లడించారు. కేసులో ఇప్పటికే 28 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. చాలా మంది కోర్టు ను ఆశ్రయించడం వలన కొంత జాప్యం జరిగిందని కేసును సిఐడి కి అప్ప చెప్పడం జరిగిందని తెలిపారు.

Published : 
  • 17 October 2024, 6:10 PM IST