డయల్ వ్యూ: ఏపీ పిచ్చోడి చేతిలో రాయిలా మారిందా? రాజధాని చుట్టూ రాజకీయాలు ఏంటి?

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని గండం ఉందా? లేక వాళ్ళ జాతకాల్లో రాజధానే లేదా? గడచిన వందేళ్లుగా ఆంధ్రులు వాళ్ల నాయకుల తప్పిదాలు వలన ఈరోజుకి రాజధాని లేని ప్రజలు గానే మిగిలిపోయారు ఏపీ జనం

Post Published By: dialnews
Updated : 4 July 2026, 10:28 AM IST

ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని గండం ఉందా? లేక వాళ్ళ జాతకాల్లో రాజధానే లేదా? గడచిన వందేళ్లుగా ఆంధ్రులు వాళ్ల నాయకుల తప్పిదాలు వలన ఈరోజుకి రాజధాని లేని ప్రజలు గానే మిగిలిపోయారు ఏపీ జనం.. బహుశా దేశ చరిత్రలోనే కాదు... ప్రపంచ చరిత్రలో కూడా రాజధాని లేని ప్రజలు ఆంధ్రప్రదేశ'వాళ్లేనేమో.ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యే వరకు తమిళనాడు మద్రాస్ నీ రాజధానిగా భావిస్తూ బతికేశారు. మద్రాసు ఆంధ్రుల రాజధాని కాదు తమిళలు రాజధాని .1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక కర్నూలు కొన్నాళ్లు ఆంధ్రుల రాజధానిగా ఉంది. ఆ తర్వాత 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు అయ్యాక హైదరాబాద్ రాజధాని అయింది.2014 లో రాష్ట్రం విడిపోయిన తర్వాత హైదరాబాద్ కూడా తెలంగాణ రాజధాని అయిపోయింది. ఆంధ్ర వాళ్ళు రాజధాని లేకుండానే మిగిలిపోయారు.

చెన్నై, కర్నూలు, హైదరాబాద్ ఏవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధానిగా మిగలలేదు. పిల్లి తన పిల్లల్ని చెప్పినట్టు మూడు రాజధానులు తిరిగి ఇప్పుడు నాలుగో రాజధాని వెతుక్కుంటున్నారు ఆంధ్ర వాళ్ళు. తెలంగాణతో ఆంధ్ర విడిపోయి ఇప్పటికి 12 ఏళ్ళు అయింది. ఈరోజుకి ఒక రాజధాని అంటూ లేక దిక్కు మొక్కు లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఆంధ్ర ప్రదేశ్. దీనికి ప్రధాన కారణం రెండు అగ్రకులాలు, వాటి అనుబంధంగా పనిచేసే రెండు ప్రధాన పార్టీలు . వైసిపి, టిడిపి ఆడుతున్న వికృత క్రీడ ఫలితంగా ఆంధ్రా వాళ్లకి ఈరోజుకి రాజధాని లేకుండా పోయింది.ఏపీలో 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు కొత్త రాజధాని నిర్మాణానికి తెర తీశాడు. అంతకు ముందు దేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రాలు చిన్నచిన్న రాజధానులు నిర్మించుకొని మూడు నాలుగు ఏళ్లలో పాలన వ్యవహారాలు మొదలుపెట్టేసేయ్. కానీ తన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని భ్రమలో లక్షల కోట్లతో రాజధాని నిర్మాణం ప్రారంభించారు.

ఒకరకంగా హైదరాబాద్ లో చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారమే ఇక్కడ చేశారు. అమరావతి రాజధానిగా చేయబోతున్నట్టుగా ముందే టిడిపి వాళ్లకి, కమ్మ సామాజిక వర్గం వాళ్లకి సమాచారం ఇచ్చి అక్కడ 60 శాతం పైగా భూములు వాళ్ల చేత కొనిపించారు అనేది వైసిపి చేస్తున్న ప్రధాన ఆరోపణ. అందులో నిజం లేకపోలేదు.2014 తర్వాత అమరావతి చుట్టుపక్కల భూముల రిజిస్ట్రేషన్ చూస్తే ఒక పథకం ప్రకారమే రైతుల నుంచి అక్కడ భూములు కొనేసినట్లు తెలుస్తుంది. వైసిపి రాజధానిగా అమరావతిని వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇదే. అంతేగాక అమరావతికి వరద ఉప్పు ఉందని, 60 వేల ఎకరాలు సేకరించి దానిపై లక్షల కోట్లు జనం సొమ్ము ఖర్చుపెట్టి రాజధాని కట్టడం అవసరమా అన్నది చాలామంది వాదన.
విభజన తర్వాత తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రం మీద రాజధాని పేరుతో లక్షల కోట్ల అప్పు మోపడం సమంజసమా అనేది మరికొందరు ప్రశ్న. అమరావతి నిర్మాణం పనుల్లో కూడా భయంకరమైన అవినీతి జరుగుతోందని వైసిపి ఆరోపిస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు ఇవన్నీ వినే పరిస్థితిలో లేరు.400 సంవత్సరాల లో ఏర్పడిన హైదరాబాద్ని నాలుగేళ్లు లో సృష్టిస్తానని ఆయన భీష్మించుకుని కూర్చున్నాడు. 2014.... 19 మధ్య రాజధాని పూర్తి చేయలేకపోయాడు చంద్రబాబు.

చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ ,రాజధాని విషయంలో అలా పొరపాటు చేస్తే జగన్ ,వైసీపీ.... రాజధాని విషయంలో తమదైన అరాచకం చేశాయి. అసెంబ్లీలో అమరావతికి జై కొట్టిన జగన్, 19 లో సీఎం అయ్యాక మూడు రాజధానుల పాట అందుకున్నాడు. విశాఖ, కర్నూల్, విజయవాడ లో ఎగ్జిక్యూటివ్, అడ్మినిస్ట్రేటివ్, న్యాయ రాజధానులను విడివిడిగా పెట్టాలని ప్రతిపాదించాడు. పోనీ ఐదేళ్లలో అవేనా పూర్తి చేశాడ....అంటే అదీ లేదు. అమరావతిలో సగం కట్టిన నిర్మాణాలను అలాగే వదిలేసి... టిడిపి పై కమ్మ సామాజిక వర్గంపై తన కసినంత తీసుకున్నాడు జగన్. చివరికి 2019 ..24 మధ్య కూడా రాజధాని లేకుండానేఆంధ్ర వాళ్ళు ఐదేళ్లు బతికేశారు. అంటే పదేళ్లు రాజధాని లేకుండా గడిచిపోయాయి. అమరావతి విషయంలో జగన్ టార్గెట్ ఒక్కటే. అక్కడ భూములు కొన్న కమ్మవాళ్లను ఆర్థికంగా దెబ్బ కొట్టాలన్నదే అతని వ్యూహం.

2024లో బంపర్ మెజార్టీతో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు మళ్లీ అమరావతిని తన ప్రధాన అజెండాగా పెట్టుకున్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతి మీద ఖర్చు చేస్తున్నారు. అమరావతి తో అద్భుతాలు జరుగుతాయి అనేది బాబు గారి వాదన. రాష్ట్రంలో మిగిలిన జిల్లాల నీ నిర్లక్ష్యం చేసి అమరావతి ఎందుకు కట్టాలని వైసీపీ వాదన. అందుకే ఖర్చు తక్కువలో మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య మావిగం పేరుతో 20 వేల కోట్లతో రాజధాని అభివృద్ధి చేయవచ్చని వివాదం లేపారు జగన్. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం మావిగన్ చుట్టే తిరుగుతున్నాయి.కమ్మ సామాజిక వర్గం చేతిలో ఉన్న అమరావతిని ఏదోరకంగా అడ్డుకోవాల్సిందే... అనే లక్ష్యంతో ఉన్న జగన్ అమరావతిపై మావిగన్ ఆయుధాన్ని ప్రయోగించాడు.. దీంతో ఎక్కడికక్కడ రియల్ ఎస్టేట్ మొత్తం స్తంభించిపోయింది. అంతేకాదు అమరావతిలో అదనంగా భూమి ఇవ్వడానికి చాలా ప్రాంతాల్లో రైతులు నిరాకరిస్తున్నారు.20 29 ఎన్నికల అజెండా మావిగన్ వర్సెస్ అమరావతి అని జగన్ ప్రకటించేశాడు. దీంతో రాజధాని సబ్జెక్టు మరోసారి రచ్చకెక్కింది.

నిజంగా జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అమరావతిని గాలికి వదిలేసి, మావిగ నిర్మాణం చేపడితే ఏంటి పరిస్థితి? భూములు ఇచ్చిన రైతులు ఏం అవ్వాలి? భూములు కొన్నవాళ్లంతా ఏమవ్వాలి? అక్కడ కట్టిన నిర్మాణాలు ఏమవుతాయి? లక్షల కోట్లు పోసి నిర్మించిన అమరావతి ఏమైపోతుంది? అలాగని మావిగన పూర్తవుతుందా?మావిగంటి రాజధానిగా గుర్తింపు వస్తుందా? ఎన్నో ప్రశ్నలు సామాన్యుని వేధిస్తున్నాయి. కమ్మ రెడ్డి కులాలు , టిడిపి వైసిపి పార్టీలు రాజధాని నీ ఆర్థికంగా కైవసం చేసుకోవడానికి చేస్తున్న దుర్మార్గపు రాజకీయాలకు ఏపీ ప్రజలకు రాజధాని లేకుండా పోయింది. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్ళు అయింది. ఎప్పటికీ రాజధాని లేదు. మళ్లీ 2029 లో కొత్త రాజధాని కడతామంటే అది పూర్తయ్య వరకు రాజధాని ఉండదు. అసలు నిజంగా ప్రజలకు రాజధాని అంత అవసరమా? అది లేకుండానే 12 ఏళ్లు గడిచాయి? మరి అలాంటప్పుడు లక్షల కోట్లతో రాజధాని కడితే ఎవరికి ఉపయోగం. శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళు, మడకశిరలో బతికే వాళ్ళు జీవితంలో ఒక్కసారి అయినా రాజధాని చూస్తారా? మరి ఎవరి కోసం ఈ రాజధాని? ఎందుకు దీని చుట్టూ ఇన్ని రాజకీయాలు? జనం సొమ్ముతో ఈ వికృత క్రీడ ఏమిటి అని ఏపీలో పబ్లిక్ అంతా తిట్టుకుంటున్నారు.

 

Published : 
  • 4 July 2026, 10:28 AM IST