పోస్ట్ లపై భోరుమన్న అనిత

సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరమని ఎద్దేవా చేసారు. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలో 28శాతం నేరాలు తగ్గాయన్నారు.

Post Published By: Vencateshg
Updated : 7 November 2024, 7:19 PM IST

సచివాలయంలోని పబ్లిసిటీ సెల్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేసారు. పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్యలు విడ్డూరమని ఎద్దేవా చేసారు. జగన్ పాలనతో పోలిస్తే చంద్రబాబు హయాంలో 28శాతం నేరాలు తగ్గాయన్నారు. ఏ నేరం, ఘోరం జరిగినా ఓ వర్గం మీడియా గోతికాడ నక్కల్లా, శవాల దగ్గర రాబందుల్లా వాలి పీక్కుతినడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం మీద బురదజల్లడం మానేయండి అని హితవు పలికారు.

పోలీసుల గురించి మీరా మాట్లాడేది? అని అంటూ సెటైర్ లు వేసారు. గత ఐదేళ్లలో పోలీస్ వ్యవస్థను నాశనం చేశారన్నారు అనిత. తల్లి, చెల్లిపైనా పోస్టులు పెట్టినా జగన్ స్పందించరని... ఇప్పటికీ షర్మిల, సునీత పైనా నీఛంగా మాట్లాడుతున్నారన్నారు. పోస్టులు పెట్టి వైసీపీ బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతోందని మండిపడ్డారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని కూర్చోవాలా? అని ప్రశ్నించారు. తనపై పెట్టిన పోస్టుల పై అనిత భావోద్వేగమన్నారు. జగన్ పాలనలోనే విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి సరఫరా జరిగిందన్నారు. వైసీపీ రౌడీలు, గూండాలు, సైకోలతో మహిళల పై నీఛాతినీఛంగా మాట్లాడించిన చరిత్ర జగన్ ది అని మండిపడ్డారు ఆమె. జగన్...నీకు ఇప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకొచ్చిందా? అని ప్రశ్నించారు.

Published : 
  • 7 November 2024, 7:19 PM IST