అమెరికా దిగ్బంధనం మొదలైంది. కానీ ఇరాన్ భయపడటం లేదు, రివర్స్ లో వేట మొదలుపెట్టింది. 'మా ఓడరేవులకు ముప్పు వస్తే, గల్ఫ్ లో ఏ పోర్టూ మిగలదు' అని ఇరాన్ చేసిన హెచ్చరిక వెనుక ఉన్న అసలు అర్థం ఏంటో తెలుసా..? ఇరాన్ తన క్షిపణులను ఇప్పటికే గల్ఫ్ లోని కీలక ఓడరేవుల వైపు గురిపెట్టి ఉంచింది. ఏయే దేశాల్లోని ఏయే ఓడరేవులను ఇరాన్ స్మశానంగా మార్చబోతోంది..? వాటిని ఎలా ధ్వంసం చేయబోతోంది..?
టార్గెట్ నంబర్ 1.. దుబాయ్ లోని జెబెల్ అలీ.. యూఏఈ ఆర్థిక గుండెకాయ ఇది. దుబాయ్‌లోని జెబెల్ అలీ పోర్ట్ ప్రపంచంలోనే అతిపెద్ద హబ్. మరి ఇరాన్ ఎలా టార్గెట్ చేస్తుంది..?: ఇరాన్ తీరం నుంచి జెబెల్ అలీ కేవలం 150 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇరాన్ తన 'ఫాతే-110' షార్ట్ రేంజ్ మిస్సైల్స్ తో దీనిని సెకన్లలో తాకగలదు. ఈ పోర్ట్ గనక దెబ్బతింటే, గల్ఫ్ దేశాల వాణిజ్యం మొత్తం స్తంభిస్తుంది. లక్షల కోట్ల నష్టం వాటిల్లుతుంది. ఇరాన్ తన 'షహీద్' డ్రోన్లను వందల సంఖ్యలో పంపి అక్కడి క్రేన్లు, స్టోరేజ్ ట్యాంకర్లను పేల్చేయగలదు.
టార్గెట్ నంబర్ 2.. కింగ్ అబ్దుల్ అజీజ్ పోర్ట్.. దమామ్, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాకు ఇది అత్యంత కీలకమైన ఓడరేవు. ఇరాన్ తన 'గల్ఫ్ ఫార్స్' యాంటీ-షిప్ క్షిపణులను దీనిపై ప్రయోగించవచ్చు. ఇది సూపర్ సోనిక్ వేగంతో దూసుకెళ్లి ఓడరేవులోని టెర్మినల్స్ ను ధ్వంసం చేస్తుంది. సౌదీ నుంచి వచ్చే చమురు ఎగుమతులు ఆగిపోతాయి. అమెరికాకు చమురు అందకుండా చేయడానికి ఇరాన్ చేసే మొదటి దాడి ఇదే అవుతుంది. ఇది జరిగితే ట్రంప్ కుర్చీ కదలడం కాదు.. రిక్టర్ స్కేలుపై వందతో అమెరికా షేక్ అవుతుంది.
టార్గెట్ నంబర్ 3.. పోర్ట్ ఆఫ్ ఖలీఫా బిన్ సల్మాన్, బహ్రెయిన్. ఇక్కడ ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంది. అలాగే ఇక్కడ ఒక పెద్ద చిక్కు కూడా ఉంది. బహ్రెయిన్ లో అమెరికాకు చెందిన 'ఫిఫ్త్ ఫ్లీట్' బేస్ ఉంది. అమెరికా యుద్ధ నౌకలు ఇక్కడే ఉంటాయి కాబట్టి, ఇరాన్ తన ఆత్మాహుతి స్పీడ్ బోట్లతో ఈ పోర్ట్ ను చుట్టుముడుతుంది. ఒక్కసారిగా వంద బోట్లు బాంబులతో వచ్చి ఢీకొంటే, అమెరికా డిఫెన్స్ సిస్టమ్స్ కూడా ఏమీ చేయలేవు. పోర్ట్ మొత్తం అగ్నిగుండంగా మారుతుంది. అప్పుడు పెంటగాన్ షేక్ కాదు.. ఉచ్చపోసేస్తుంది.
టార్గెట్ నంబర్ 4.. పోర్ట్ ఆఫ్ షువైఖ్, కువైట్.. అమెరికా సైనిక సరఫరాలకు కువైట్ లోని ఈ ఓడరేవు చాలా ముఖ్యం. ఈ ఓడరేవుకు వచ్చే దారిలో ఇరాన్ వేల సంఖ్యలో 'స్మార్ట్ మైన్స్' పరిచేసింది. అమెరికా సరఫరా నౌకలు ఒక్కటి అడుగు పెట్టినా సముద్రం గర్భంలోకి వెళ్లాల్సిందే. ఇలా 'మా పోర్టులను ఆపితే, మీ సైన్యానికి తిండి, ఆయుధాలు అందకుండా చేస్తాం' అని ఇరాన్ ఈ పోర్ట్ ను టార్గెట్ చేస్తోంది.. అర్ధమైందా.. ఉంటే అందరికీ ఉండాలి. లేదా ఎవడికి దక్కకూడదు.. సింపుల్.. నాకు దక్కనిది ఎవడికీ దక్కదు.
ఇరాన్ ప్లాన్ చాలా సింపుల్ ...ఇంగ్లీష్ లో చెప్పాలంటే.. . 'Security for all, or Security for none'. మా ఓడరేవుల నుంచి చమురు వెళ్లకపోతే, గల్ఫ్ లోని ఏ పోర్ట్ నుంచి కూడా ఒక్క చుక్క చమురు బయటకు వెళ్లనివ్వం. అమెరికా తన దిగ్బంధనాన్ని కొనసాగిస్తే, గల్ఫ్ సముద్రం మొత్తం పేలిన ట్యాంకర్లతో, మండుతున్న ఓడరేవులతో వల్లకాడవుతుంది. ఇరాన్ అన్నంత పని చేయడానికి సిద్ధంగా ఉంది. సీజ్ ఫైర్ గ్యాప్ లో ఇరాన్ తన మిస్సైల్స్ ను గురిపెట్టి ఉంచుతోంది.
ఇరాన్ దగ్గర ఉన్న అతిపెద్ద బలం వాళ్ళ 'రివల్యూషనరీ గార్డ్స్' నేవీ. వీళ్ళు పెద్ద నౌకల జోలికి వెళ్లరు. అసలు ప్లాన్ ఏంటీ అంటే.. గల్ఫ్ ఓడరేవుల ప్రవేశ ద్వారాల వద్ద, పాత ఓడలను లేదా సిమెంట్ నింపిన భారీ కంటైనర్లను ముంచేయడం. ఒక్కసారి ఓడరేవు ముఖద్వారం వద్ద ఏదైనా భారీ నౌక మునిగిపోతే, ఆ పోర్ట్ కొన్ని నెలల పాటు పని చేయదు. అమెరికా ఎంత ప్రయత్నించినా ఆ రూట్ క్లియర్ చేయడం సాధ్యం కాదు. అంటే, ఒక్క పైసా ఖర్చు లేకుండా ఓడరేవును 'డెడ్' చేయొచ్చు.
ఆధునిక ఓడరేవులన్నీ.. అంటే దుబాయ్, దమామ్ వంటివి, పూర్తిగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ మరియు ఏఐ మీద నడుస్తాయి. ఇరాన్ సైబర్ ఆర్మీ ఆ ఓడరేవుల 'కంటైనర్ మేనేజ్మెంట్ సిస్టమ్'ని హ్యాక్ చేసే ప్లాన్ చేస్తోంది. ఏ కంటైనర్ ఎక్కడుందో తెలియదు, క్రేన్లు పని చేయవు, ఏ ఓడ ఎప్పుడు రావాలో కమ్యూనికేషన్ తెగిపోతుంది. ఫిజికల్ గా బాంబు వేయకుండానే ఓడరేవును స్తంభింపజేయడం అంటే ఇదే. ఇది ఇరాన్ కు వెన్నతో పెట్టిన విద్య. గల్ఫ్ ఓడరేవులకు అనుసంధానంగా సముద్రపు అడుగున వేల కిలోమీటర్ల చమురు పైప్లైన్లు మరియు ఇంటర్నెట్ కేబుల్స్ ఉన్నాయి.
ఇరాన్ తన చిన్నపాటి సబ్ మెరైన్లు, డైవర్ల ద్వారా ఈ పైప్లైన్లను, కేబుల్స్ ను కట్ చేయడం ఇరాన్ ప్లాన్. ఓడరేవు సురక్షితంగా ఉన్నా, అక్కడికి రావాల్సిన చమురు రాదు, పోర్ట్ నుంచి డేటా బయటకు వెళ్లదు. మొత్తం గల్ఫ్ రీజియన్ 'బ్లాక్ అవుట్' లోకి వెళ్ళిపోతుంది. ఇరాన్ తన వేల సంఖ్యలో ఉన్న చిన్న చేపల వేట పడవలను గల్ఫ్ అంతటా విస్తరిస్తుంది. ఈ ప్లాన్ తో.. అమెరికా నౌకలు లేదా గల్ఫ్ దేశాల ట్యాంకర్లు వెళ్లే దారిలో ఈ పడవలను అడ్డుగా పెట్టడం. అమెరికా వీటి మీద దాడి చేస్తే 'సామాన్యులను చంపుతున్నారు' అనే అపవాదు వస్తుంది.
దాడి చేయకపోతే నౌకలు ముందుకు కదలవు. ఇది అమెరికాను నైతికంగా మరియు వ్యూహాత్మకంగా ఇరుకున పెట్టే ప్లాన్. ఇరాన్ తన వార్నింగ్ తో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొడుతోంది. గల్ఫ్ దేశాలకు భయం పుట్టించడం. "అమెరికాకు మీరు స్థావరాలు ఇస్తే, మీ పోర్టులే మాకు మొదటి టార్గెట్" అని చెప్పడం. ఇప్పటికే ఒమన్, ఖతార్ వంటి దేశాలు అమెరికాను వెనక్కి తగ్గమని ఒత్తిడి చేస్తున్నాయి. అమెరికా తన మిత్రదేశాల నుంచే వ్యతిరేకత ఎదుర్కోవాల్సి రావడం ఇరాన్ సాధించిన అతిపెద్ద విజయం.