Top story: పెంటగాన్ ను పెంట పెంట చేసిన ఇరాన్.. సింగిల్ స్ట్రోక్ తో వైట్ హౌస్ కు చావుదెబ్బ…?

ఇరాన్ తో అమెరికా చేస్తున్న యుద్ధం పిచ్చి తనమేనా..? పట్టు సాధించడం పక్కన పెడితే, అమెరికా పరువు పోతుందా..? కాకి లెక్కలు వేసి వార్ షురూ చేసిన అమెరికాకు.. ఇరాన్ కొడుతున్న దెబ్బలు, అమెరికా ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయా..?

Post Published By: dialnews
Updated : 21 March 2026, 9:39 AM IST

ఇరాన్ తో అమెరికా చేస్తున్న యుద్ధం పిచ్చి తనమేనా..? పట్టు సాధించడం పక్కన పెడితే, అమెరికా పరువు పోతుందా..? కాకి లెక్కలు వేసి వార్ షురూ చేసిన అమెరికాకు.. ఇరాన్ కొడుతున్న దెబ్బలు, అమెరికా ప్రతిష్టను గంగలో కలుపుతున్నాయా..? పక్కాగా అవుననే అంటున్నాయి ఇంటర్నేషనల్ మీడియా సంస్థలు. లేటెస్ట్ గా ఇరాన్ ఇచ్చిన స్ట్రోక్ కు.. వైట్ హౌస్ షేక్ అయింది. పెంటగాన్ లో పెంట పెంట అయింది. అసలు ఏం చేసింది ఇరాన్..?

నాలుగు రోజుల క్రితం అనుకుంట అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్.. కళ్ళు పెద్దవి చేసి.. మాది పవర్ ఫుల్ ఆర్మీ అన్నాడు. ఆ మాటల సౌండ్ ఇంకా ప్రపంచం చెవుల్లో వినపడుతున్నప్పుడే.. ఇరాన్ ఇచ్చిన మాస్టర్ స్ట్రోక్ కు రీ సౌండ్ అంతరిక్షంలో కూడా వినపడింది. ప్రపంచం నిర్ఘాంతపోయేలా, అమెరికా గర్వకారణంగా చెప్పుకునే మోస్ట్ పవర్ ఫుల్ యుద్ధ విమానం కూలిపోయింది. అది కూడా ఇరాన్ గడ్డపై. రక్షణ రంగ నిపుణులు సైతం ఇది అసాధ్యం అని భావించిన ఘటన ఇప్పుడు వాస్తవ రూపం దాల్చింది. అమెరికాకు చెందిన అత్యాధునిక F-35 లైటనింగ్ 2.. స్టీల్త్ యుద్ధ విమానాన్ని ఇరాన్ తన స్వదేశీ క్షిపణి వ్యవస్థతో కూల్చివేసింది.

అసలు అంత పర్ఫెక్ట్ గా ఇలా కూల్చింది..? అమెరికా రక్షణ వ్యవస్థలో అత్యంత ఖరీదైన, శత్రువుల రాడార్లకు చిక్కని విమానంగా F-35కు పేరుంది. కానీ, ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించిన ఈ విమానం నిప్పుల ముద్దగా మారి కింద పడటం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మార్చి 19, రాత్రి వేళ, ఇరాన్‌లోని కీలక అణు, సైనిక స్థావరాలపై నిఘా ఉంచేందుకు లేదా దాడులు చేసేందుకు అమెరికాకు చెందిన F-35 విమానం ఇరాన్ గగనతలంలోకి ప్రవేశించింది. అయితే, ఇరాన్ రక్షణ దళాలు దీనిని గుర్తించి, కేవలం నిమిషాల వ్యవధిలోనే క్షిపణిని ప్రయోగించి కుప్పకూల్చాయి.

రాడార్లకు దొరకకుండా ప్రయాణించే టెక్నాలజీ ఉన్నప్పటికీ, ఇరాన్ దీనిని ఎలా అడ్డుకోగలిగిందనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. దీని వెనుక కొన్ని కీలక కారణాలు ఉండవచ్చని రక్షణ నిపుణులు భావిస్తున్నారు. స్వదేశీ రాడార్ వ్యవస్థ ఇక్కడ కీ రోల్ ప్లే చేసి ఉండవచ్చు. ఇరాన్ డెవలప్ చేసిన సరికొత్త 'క్వాంటం రాడార్' లేదా రష్యా సాయంతో తీసుకున్న లేటెస్ట్ సెన్సార్ల వల్ల ఈ స్టీల్త్ విమానం ఆనవాళ్లు దొరికి ఉండవచ్చు. ఖోర్దాద్-15 క్షిపణి వ్యవస్థతోనే ఈ విమానాన్ని ఇరాన్ కూల్చింది. గతంలో గ్లోబల్ హాక్ డ్రోన్‌ను కూల్చిన ఈ క్షిపణి వ్యవస్థనే ఈసారి మరింత దేవేలేప్ చేసి F-35పై ప్రయోగించినట్లు తెలుస్తోంది. విమానంలోని సిగ్నళ్లను జామ్ చేసి, దానిని రాడార్ పరిధిలోకి వచ్చేలా ఇరాన్ సైన్యం వ్యూహం పన్ని ఉండవచ్చు.

F-35 విమానం కూలిపోవడం వల్ల అమెరికా రక్షణ రహస్యాలు, స్టీల్త్ టెక్నాలజీ రహస్యాలు బయటపడే ప్రమాదం ఉంది. కూలిన విమాన భాగాలను ఇరాన్ సేకరిస్తే, అమెరికా ఆయుధ రహస్యాలు శత్రువుల చేతికి చిక్కినట్టే. ఒక్కో F-35 విమానం ధర సుమారు 100 మిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో సుమారు రూ. 830 కోట్లు. ఇది కేవలం ఆర్థిక నష్టమే కాదు, అమెరికా సైనిక ప్రతిష్టకు జరిగిన తీరని అవమానం. ఈ ఘటన తర్వాత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అత్యవసర భేటీ అయ్యారు.

తమ విమానాన్ని కూల్చడం అంటే అమెరికాపై యుద్ధం ప్రకటించడమేనని ట్రంప్ హెచ్చరించారు. తమ భూభాగాన్ని కాపాడుకోవడానికి ఎంతటి ఆధునిక విమానాన్ని అయినా కూల్చుతామని ఇరాన్ స్పష్టం చేసింది. ఈ కూల్చివేతతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరాయి. USS ట్రిపోలి వంటి యుద్ధనౌకలను అమెరికా మరింత వేగంగా మోహరించడానికి ఇది కారణమైంది. మరోవైపు, ఈ విమానం కూలిపోవడంతో నాటో దేశాలు కూడా తమ వద్ద ఉన్న F-35 విమానాల భద్రతపై ఆందోళన చెందుతున్నాయి.

ప్రస్తుతం సుమారు 15 దేశాలు ఎఫ్-35 యొక్క వివిధ రకాలను ఉపయోగిస్తున్నాయి. ప్రపంచ చరిత్రలో తొలిసారిగా ఒక స్టీల్త్ యుద్ధ విమానం క్షిపణి దాడిలో కూలిపోవడం ఒక సంచలనం. ఇది కేవలం ఇరాన్-అమెరికా మధ్య పోరు మాత్రమే కాదు, ప్రపంచ దేశాల మధ్య ఆయుధ పోటీని, సాంకేతిక యుద్ధాన్ని ఒక కొత్త స్థాయికి తీసుకెళ్లింది. గురువారం జరిగిన సంఘటనను, 1999లో అమెరికాకు చెందిన స్టెల్త్ ఎఫ్-117 నైట్‌హాక్‌ను కూల్చివేసిన ఘటనతో పోల్చవచ్చు. అప్పట్లో ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన ఆ దాడి విమానాన్ని 1990ల ప్రారంభంలో ప్రవేశపెట్టారు, మరియు అది 1991లో జరిగిన మొదటి గల్ఫ్ యుద్ధంలో కూడా పాల్గొంది.

Published : 
  • 21 March 2026, 9:39 AM IST