మెగా హీరోలకు లక్కీ హీరోయిన్…!

టాలీవుడ్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ఢిల్లీ భామ, మెగా ఫ్యామిలీ హీరోలతో నటించినప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం

Post Published By: dialnews
Updated : 21 March 2026, 11:43 AM IST

టాలీవుడ్ గ్లామర్ డాల్ రాశి ఖన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన క్యూట్ లుక్స్‌తో, అద్భుతమైన నటనతో కుర్రకారు మనసు దోచుకున్న ఈ ఢిల్లీ భామ, మెగా ఫ్యామిలీ హీరోలతో నటించినప్పుడు మాత్రం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తోంది. అందుకే ఇప్పుడు ఫిలిం నగర్ వర్గాల్లో రాశి ఖన్నాను మెగా హీరోల 'లక్కీ మస్కట్' అని పిలుస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సుప్రీం సినిమాతో రాశి ఖన్నాకు మాస్ ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఇందులో ఆమె పోషించిన 'బెల్లం శ్రీదేవి' క్యారెక్టర్ ఇప్పటికీ ఫ్యాన్స్‌కు ఫేవరెట్. సాయి ధరమ్ తేజ్ మాస్ ఇమేజ్‌కు, రాశి కామెడీ టైమింగ్ తోడవడంతో ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

మారుతి దర్శకత్వంలో వచ్చిన ప్రతిరోజూ పండగే సినిమా ఒక క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో 'ఏంజెల్ ఆర్న'గా రాశి ఖన్నా చేసిన టిక్‌టాక్ హంగామా సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యింది. తేజుతో ఆమె కెమిస్ట్రీ మరోసారి వర్కవుట్ అవ్వడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. ఇక మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఏది అంటే అందరికీ గుర్తొచ్చే పేరు 'తొలిప్రేమ'. మరి ఈ సినిమాలో వరుణ్‌కు పర్ఫెక్ట్ జోడీగా నటించి మెప్పించింది ఢిల్లీ డాల్.

వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, రాశి ఖన్నాను టాలీవుడ్‌లో ఒక పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ హీరోయిన్‌గా నిలబెట్టింది. మెగా హీరోలకి రాశి ఖన్నా లక్కీ చార్మ్ అనడానికి ఈ సినిమా కూడా ఒక పెద్ద ఉదాహరణ! ఈ నేపథ్యంలోఇప్పుడు 'ఉస్తాద్'తో ఆ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయ్యింది. ఈ చిత్రంలో రాశి 'శ్లోక' అనే పాత్రలో తన గ్లామర్‌తో పాటు కామెడీతోనూ అలరించింది. సాక్షి వైద్య ప్లేస్‌లో లాస్ట్ మినిట్‌లో రాశి ఎంపికైనప్పటికీ, పవన్ కళ్యాణ్‌తో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకు ఒక మేజర్ ప్లస్ పాయింట్ అయ్యిందని టాక్ వినిపిస్తోంది. స్టోరీ వినకుండానే కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న గౌరవంతో ఈ సినిమా సైన్ చేసిన రాశికి, ఇప్పుడు 'ఉస్తాద్' బ్లాక్ బస్టర్ అవ్వడం పెద్ద బూస్ట్ అని చెప్పాలి. అందుకే మెగా ఫ్యాన్స్ ఆమెను ఇప్పుడు 'మెగా లక్కీ చార్మ్' అని పిలుస్తున్నారు.

Published : 
  • 21 March 2026, 11:43 AM IST