పవన్ కు జేసి సపోర్ట్

నేనే హోం మంత్రిని అయితే అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం అవుతున్నాయి.

Post Published By: Vencateshg
Updated : 4 November 2024, 4:14 PM IST

నేనే హోం మంత్రిని అయితే అంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సంచలనం అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పై స్పందించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి... పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు మద్దతు ఇచ్చారు. గత అయిదేళ్ళు గా లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలం అయిందని... ఇప్పుడు కూడ అదే బాటలో నడుస్తుందని మండిపడ్డారు.

ఇంకా అధికారుల తీరు మారడం లేదని అసహనం వ్యక్తం చేసారు. కనీసం ఇప్పటికయినా అధికారుల తీరు మార్చుకోవాలని ఆయన హితవు పలికారు. ఐఏఎస్, ఐపీఎస్ లు వైసీపీ కి పూర్తిగా దాసోహం అయ్యారని ఆర్థిక, రాజకీయ ఒత్తిడులకు ఉన్నతాధికారులు తలొగ్గద్దని సూచించారు. కాగా ఏపీలో ఇటీవలి కాలంలో మహిళలపై దాడులు పెరిగిన సంగతి తెలిసిందే.

Published : 
  • 4 November 2024, 4:14 PM IST