Top story: నన్ను చంపాలని చూస్తున్నాడు…! కోడలు సంచలన కామెంట్స్..!

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన, అంతకన్నా ఎక్కువగా నిర్ఘాంతపోయే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత పెద్ద కోడలు జోగి మేఘన

Post Published By: dialnews
Updated : 29 July 2026, 12:00 PM IST

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలనమైన, అంతకన్నా ఎక్కువగా నిర్ఘాంతపోయే వార్త ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తోంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కుటుంబంపై సొంత పెద్ద కోడలు జోగి మేఘన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. అదనపు కట్నం కోసం వేధించడమే కాకుండా, తనను ఏకంగా మూడు సార్లు చంపడానికి ప్రయత్నించారంటూ మేఘన చేసిన ఆరోపణలు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. అసలు ఆ ఫిర్యాదులో ఆమె ఏం పేర్కొంది? ఎలాంటి దారుణాలు జరిగాయి?

వివరాల్లోకి వెళ్తే.. జోగి రమేష్ పెద్ద కుమారుడు జోగి రాజీవ్‌తో మేఘనకు 2025 మే 28న సూర్యాపేటలో వివాహం జరిగింది. పెళ్లి సమయంలో మేఘన తల్లిదండ్రులు దాదాపు ఐదు కోట్ల రూపాయల ఖర్చుతో వివాహం జరిపించడమే కాకుండా, ఒకటిన్నర కిలోల బంగారం, 10 కిలోల వెండి, ఇంకా ఎన్నో కట్న కానుకలు ఇచ్చారు. కానీ, పెళ్లయిన నెల రోజుల నుంచే అత్తింటి వేధింపులు మొదలయ్యాయట. అంతా ఇచ్చినా చాలదన్నట్టు.. అదనంగా మరో 5 కోట్ల రూపాయల నగదు, ఒక ఫార్చ్యూనర్ కారు, అత్త శకుంతలకు, ఆడపడుచులకు వజ్రాల హారాలు తీసుకురావాలంటూ వేధించడం స్టార్ట్ చేశారు. అంతేకాదు, మేఘన పేరు మీద ఉన్న ఆస్తులను కూడా భర్త రాజీవ్ పేరు మీదకు మార్చాలని తీవ్ర ఒత్తిడి తెచ్చారని మేఘన తన ఫిర్యాదులో పేర్కొంది.

కేవలం వేధింపులతో ఆగితే ఇది సాధారణ గృహహింస కేస్ అయ్యేదేమో.. కానీ మేఘన చేసిన అసలైన ఆరోపణలు వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. తను ప్రశ్నిస్తే ఇంట్లోనే బంధించి, రెండు రోజుల పాటు అన్నం పెట్టకుండా మానసిక నరకం చూపించారని వాపోయింది. అంతకన్నా ఘోరం ఏంటంటే.. తనను చంపడానికి ఏకంగా మూడు సార్లు ప్లాన్ చేశారని ఆరోపించింది. ఒకసారి ఇంటి టెర్రస్‌ పైనుంచి మామ జోగి రమేష్, ఆయన సోదరుడు రాము, వారి స్నేహితుడు కలిసి తనను కిందకు తోసేయడానికి చూశారట. ఇక గోవా టూర్‌కు వెళ్లినప్పుడు అక్కడ లోయలోకి తోసేయడానికి, బోటులోంచి నెట్టేయడానికి ప్రయత్నించారని చెప్పింది.

చివరిగా.. 2026 ఏప్రిల్ 13న అర్ధరాత్రి హైదరాబాద్ నార్సింగి విల్లాలో భర్త, అత్త, మామ, ఆడపడుచు అందరూ కలిసి ఏకమై దారుణానికి ఒడిగట్టారట. మామ జోగి రమేష్ ముఖంపై దిండు పెట్టి గట్టిగా నొక్కగా, భర్త రాజీవ్ మెడకు చున్నీ బిగించి ఉరి వేసి చంపడానికి చూశారని, భయంతో విలవిలలాడుతూ వాళ్ల కాళ్లపై పడి.. 'మీరు చెప్పినట్టే వింటాను, నన్ను వదిలేయండి' అని ప్రాధేయపడటంతో ప్రాణాలతో వదిలేశారని మేఘన కన్నీటి పర్యంతమైంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. పెళ్లికి ముందు వాళ్లు హిందూ సాంప్రదాయాలు పాటిస్తామని చెప్పి, పెళ్లయ్యాక తామంతా క్రైస్తవంలోకి మారామనే నిజాన్ని బయటపెట్టారట.

మేఘన ఇంట్లో పూజ చేసి అగర్‌బత్తీ వెలిగిస్తే.. 'శవం దగ్గర ఉన్న వాసన వస్తోంది' అంటూ తీవ్రంగా అవమానించేవారని ఆమె తెలిపింది. భర్తకు ఉన్న శారీరక లోపాలను కూడా దాచిపెట్టి మోసం చేశారని ఆరోపించింది. ఈ దారుణాలన్నింటిపై ప్రాణభయంతో మేఘన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన భార్య శకుంతల, కుమారుడు రాజీవ్, సోదరుడు రాముతో పాటు మొత్తం 11 మందిపై హత్యాయత్నం, గృహహింస, కట్నం వేధింపుల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఒక పెద్ద రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబంలో.. అదీ ఒక మాజీ మంత్రి ఇంట్లో సొంత కోడలికి ఇలాంటి పరిస్థితి ఎదురవడం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. మరి పోలీసులు జరిపే ఈ దర్యాప్తులో ఎలాంటి నిజాలు బయటకు వస్తాయి? దీనిపై జోగి రమేష్ కుటుంబం ఎలా స్పందిస్తుంది? అనేది చూడాల్సి ఉంది.

Published : 
  • 29 July 2026, 12:00 PM IST