బ్రేకింగ్; కవిత సంచలన ప్రకటన…!

తెలంగాణా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనాలు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నుంచి అదే స్థాయిలో ప్రకటన వచ్చింది.

Post Published By: dialnews
Updated : 19 February 2026, 2:14 PM IST

తెలంగాణా రాజకీయాల్లో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలనాలు క్రియేట్ చేస్తోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె నుంచి అదే స్థాయిలో ప్రకటన వచ్చింది. అందరూ ఊహించినట్లుగానే కవిత.. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్దమయ్యారు.

మాజీ మంత్రి హరీష్ రావు స్థానానికి గురిపెట్టిన కవిత.. వచ్చే ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి పోటీ చేస్తానని తెలిపారు.ప్రస్తుతం కవిత చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. పార్టీని విభేదించిన తర్వాత హరీష్ రావును కవిత ఎక్కువగా టార్గెట్ చేసారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. నా మొదటి ప్రాధాన్యత సిద్ధిపేట, రెండో ప్రాధాన్యత బోధన్ అంటూ తాజా ప్రకటనతో ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. ఇక తన పార్టీకి సంబంధించి.. ఎన్నికల కమిషన్‌లో పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొదలైంది.. పార్టీ ప్రకటన మే మొదటి వారంలో చేస్తానని తెలిపారు.

Published : 
  • 19 February 2026, 2:14 PM IST