రాజమౌళి తో మహేశ్ చేస్తున్న వారాణి మూవీ 2027 మార్చ్ లో వస్తుంది. తర్వాతేంటి? ఈ ప్రశ్నకు మహేశ్ దగ్గర మూడు సమాధానాలున్నాయి.. రాజమౌళి దగ్గర మూడు ఆఫ్షన్స్ ఉన్నాయి. దర్శక ధీరుడి విషయానికొస్తే, ఎన్టీఆర్ మొదటి ఆఫ్షన్.. రెబల్ స్టార్ ప్రభాస్ రెండో ఆఫ్షన్... ఈ ఇద్దరితో కలిసి మరో మల్టీ స్టారర్ తీస్తాడా? లేదంటే విడి విడిగా ప్రయోగాలతో దాడి చేస్తాడా అన్నది తేలాలంటే, ముందు వారణాసి షూటింగ్ కి గుమ్మడి కాయ కొట్టాలి. 2030 లో రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి సినిమా ఉండొచ్చనే మాట వినిపిస్తోంది. ముందుగా ఎన్టీఆర్ తో 2027లో ఏదైనా ప్రాజెక్ట్ ఎనౌన్స్ కావచ్చని తెలుస్తోంది. కాకపోతే ఎవరి కమిట్మెంట్స్ వాళ్లకు ఉన్నాయి. ఐతే రాజమౌళి పిలిస్తే వేటినైనా పక్కన పెట్టి వచ్చేసేంత స్నేహం జక్కన్నతో ఎన్టీఆర్ కి ఉంది.. కాబట్టే వారణాసి తర్వాత రాజమౌళి నుంచి పేలబోతున్న రెండు బుల్లెట్లు, ఎన్టీఆర్, ప్రభాసే అన్న మాట రీసౌండ్ చేస్తోంది.. ఇంతకి ఏం జరగబోతోంది?
వారణాసి మూవీ జూన్ కల్లా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ తో పాటు ప్రమోషన్ మాత్రమే పెండింగ్ ఉంటాయి. సో తర్వాతేంటి అన్న ప్రశ్నకు రాజమౌళి దగ్గర రెండు ఆప్షన్స్ ఉన్నాయనంటున్నారు. రాజమౌళి పిలిస్తే, చేస్తున్న సినిమా పక్కన పెట్టి వచ్చేంత చణువున్న హీరో ఎన్టీఆర్.. రాజమౌలి కోసం రెండు కాదు నాలుగేళ్ల డేట్స్ ఇచ్చేంత డెడికేషన్ ఉన్న స్టార్ ప్రభాస్..
తనేకాదు, మహేశ్ కూడా ఏం చేయమన్నా చేస్తాడు. కాకపోతే తనఆల్రెడీ అలా వారణాసి కోసం కష్టపడుతున్నాడు. తర్వాత ఎవరి వంతొస్తుందంటే చరణ్ కూడా రాజమౌళి ఎప్పుడు పిలిచినా రెడీ.. కాకపోతే రాజమౌళి మనసులో ఏముందో.. అదే చేస్తాడు. అలాచూస్తే తన దగ్గర ఇప్పడు నెక్ట్స్ ఆప్షన్స్ గా ఎన్టీఆర్, ప్రబాస్ ఈ రెండు బుల్లెట్స్ ఉన్నాయా?ఈ ప్రశ్నకు సమాధానం, 2027, 2030 లో దొరకపోబోతోంది. ఔను మార్చ్ 2027 లో వారణాసి రిలీజ్ కాబోతోంది. ఆతర్వాత కూడా పోస్ట్ రిలీజ్ ప్రమోషన్ మరో మూడునెలలు అంటే, 2027 జూన్ వరకు రాజమౌలి బిజీ. ఆతర్వాతే తన మేకింగ్ లో ఎన్టీఆర్ సినిమా మొదలయ్యే ఛాన్స్ఉంది. అదే జరిగితే, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టి ఈ ప్రాజెక్ట్ వైపు ఎన్టీఆర్ పరుగులుపెట్టొచ్చు.
ఐతే ఈలోపు డ్రాగన్ రెండు భాగాలు, దేవర సీక్వెల్ పూర్తి చేయాలి.. తను ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం అది సాధ్యమే .. ఎటొచ్చి త్రివిక్రమ్ మేకింగ్ లో పట్టాలెక్కాల్సిన గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్ కే రాజమౌళి ఎఫెక్ట్ పడేలా ఉంది. ఐతే వారణాసి తర్వాత రెండు సినమాలు తీసి, ఆతర్వాత తన డ్రీమ్ ప్రాజెక్ట్ మహాభారతం ఫ్రాంచైజీ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడట రాజమౌళి.అందుకే తనదగ్గర రెడీగా ఉన్న రెండు కథల్ని సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయటమే కాదు, అవి మహాభారతం కంటెంట్ కి కనెక్ట్ అయిన పాత్రలని తెలుస్తోంది. వాటితోనే తన డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఒకరకంగా గేట్లు తెరుచుకోబోతున్నాయి. అంటే అసలు మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ లాంటి హెవీ ప్రాజెక్టులు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్టు.. కాకపోతే 2027 జూన్ లో ఎన్టీఆర్ సినిమామొదలవ్వొచ్చు.. కాని రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ మాత్రం 2030 లోనే మొదలయ్యేఛాన్స్ ఉంది.. 2035 నుంచి మహాభారతం బేస్ చేసుకుని వరుసగా సినిమాలు తీసేందుకు రాజమౌళి పదేళ్ల ప్లానింగ్ ముందే చేస్తున్నట్టు తెలుస్తోంది.