ఆఫ్టర్ టెన్ ఇయర్స్ ఇండియాలో భూమి కంపిస్తే, వరల్డ్ మొత్తం వణికేస్తుంది. వింటానకి కాస్త అతిశయోక్తిలా ఉన్నా, అదే జరిగేలా ఉంది. వారణాసి జస్ట్ అలా రిలీజ్ అయితే ఈ భూకంపం ప్రపంచం అంతా కంపిస్తుందా? నిజంగా అదే జరగేలా ఉంది. ప్రతీ పదేళ్ల కోసారి రాజమౌలి కొత్త ట్రెండ్ ని బాంబులా పేల్చేస్తాడు.. ఒకప్పుడు మగధీర, కట్ చేస్తే తర్వాత బాహుబలి, పదేళ్ల తర్వాత కట్ చేస్తే, ఇప్పుడు వారణాసి... ఏదో జరగబోతోందా? ఇది కేవలం మనం అనుకుంటో జరిగేది కాదు.. జస్ట్ ఇమాజిన్ పది, పదకొండేళ్ల క్రితం తను బాహుబలి తీసినందుకు.. వరుసగా పాన్ ఇండియా సినిమాల జాతరే మొదలైంది.. మణిరత్నం లాంటి వాళ్ళనే కాపాడిన ఐడియా అది... కేజీయఫ్ లు, ధురంధర్ లు, లేదంటే కాంతారాల్లాంటి విచిత్రాలొచ్చాయి.. ఇంకా వస్తున్నాయి.. 1000 కోట్ల వసూళ్లు వెరీ కామన్ అయ్యాయి.. అలాంటి మరో పెద్ద అడుగు వారణాసితో పడుతుందా? అది మరో పదేళ్ల వరకు చాలా సినిమాల తలరాత మార్చబోతోందా?
ప్రతీ పదేళ్లకో సారి జెనరేషన్ మారినట్టు, ట్రెండ్ ని రాజమౌళి మార్చేస్తున్నాడా? మగధీర, ఈగ లాంటి ప్రయోగాల తర్వాత కట్ చేస్తే బాహుబలి వచ్చింది ట్రెండ్ సెట్ చేసింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత వారణాసితో మరో ట్రెండ్ సెట్ అయ్యే టైం వచ్చిందా? ఇది డౌట్ కాదు, మారబోతున్న ఇండియన్ సినిమా ఫేట్.బాహుబలి ఎగ్జాక్ట్ గా పది పదొకొండేళ్ల క్రితం వచ్చిన సినిమా.. అప్పటి వరకు మన మార్కెట్ రేంజే 200 కోట్లు.. అలాంటిది 280కోట్లు పెట్టి బాహుబలి తీశారు.. అప్పడే అంతా నవ్వుకున్నారు. 200 కోట్ల మార్కెట్ ఉన్న ఇండస్ట్రీలో 280 కోట్లు పెట్టి సినిమా పిచ్చోల్లే తీస్తారన్నారు. కట్ చేస్తే, 280 కోట్లు 550 కోట్ల ప్రాఫిట్ గా బాహుబలి ఫస్ట్ పార్ట్ తో ప్రూవ్ అయ్యింది. తర్వాత రెండో భాగం 1850 కోట్ల హిస్టరీ క్రియేట్ చేసింది.
మన రేంజ్ ఇంతే,మన మార్కెట్ ఇంతే అనుకుంటే ఇది సాధ్యం అయ్యేదా? కొన్ని సార్లు మన మార్కెట్ చిన్నదైతే, పక్క మార్కెట్ లో కూడా జెండా పాతాలి.. అదే బాహుబలి 1,2 తో రాజమౌళి ప్రూవ్ చేశాడు. అలా దేశం మొత్తం బాహుబలితో ఏకమయ్యింది... అలా ఒక సినిమా అన్ని భాషల్లో రిలీజ్ అయితే, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుందో అందరికి తెలిసొచ్చింది.అప్పటి వరకు హిందీ సినిమా అంటే, నార్త్ లో, తెలుగు మూవీ అంటే టాలీవుడ్ లో, ఇలా ఎవరికి వారే ఎమునాతీరే.. అప్పడప్పడు కొన్ని డబ్ అయ్యేవి, లేదంటే రీమేక్ అయ్యేవి.. కాని ఇలా పాన్ ఇండియా లెవల్ లో ట్రెండ్ సెట్ చేసింది మాత్రం బాహుబలే.. అంతే అదొచ్చినప్పటి నుంచి కాంతారా, కేజీయఫ్, పుష్ప, పొన్నియన్ సెల్వం, ఇలా తెలుగు,తమిల్, మలాయళం, కన్నడ బ్యాచ్ అంతా లార్జర్ దేన్ లైఫ్ స్కేల్ నిఫాలో అవ్వటం మొదలు పెట్టారు.
బాహుబలి వచ్చి 11 ఏల్లవుతున్నా, ఇప్పటికీ రాజమౌళి వేసిన రోడ్డులోనే సౌత్, నార్త్ ఫిల్మ్ మేకర్స్ నడుస్తున్నారు. సో పదేళ్ల క్రితం అయ్యిందే, ఇప్పడు పాన్ వరల్డ్ లెవల్లో జరగబోతోందా? ఎంతసేపు వరల్డ్ వైడ్ గా మాన మూవీ ఆడాలంటే, మన వాళ్లు ఏఏ దేశాల్లో సెటిలయ్యారో అక్కడే సినిమా రిలీజ్ చేయటం చూశాం. కాని అలా కాదు, తెల్లోల్లు, ఆఫ్రికన్లు, ఆసియన్లు అంతా మన సినిమా చూడాలని పాన్ వరల్డ్ మూవీ వారణాసి తీస్తున్నాడు రాజమౌలి. మరి ఈసారి వరల్డ్ వైడ్ గా ఎలాంటి వేవ్స్ వస్తాయో చూడాలి.