Top story: దుబాయ్ కంటే హైదరాబాద్ బెస్ట్.. వరల్డ్ ఇన్వెస్టర్ల చూపు సౌత్ ఇండియా వైపు..!

దుబాయ్.. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్.. బిజినెస్ కింగ్స్ నుంచి రియల్ ఎస్టేట్ డాన్స్ వరకు ప్రతీ ఒక్కరు సేఫ్ గా భావించే రియల్ ఎస్టేట్ హబ్.

Post Published By: dialnews
Updated : 11 March 2026, 12:23 PM IST

దుబాయ్.. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్.. బిజినెస్ కింగ్స్ నుంచి రియల్ ఎస్టేట్ డాన్స్ వరకు ప్రతీ ఒక్కరు సేఫ్ గా భావించే రియల్ ఎస్టేట్ హబ్. భారత్ లో సంపాదించి, దుబాయ్ లో పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు ఎందరో. మనదుబాయ్.. రియల్ ఎస్టేట్ రంగంలో కింగ్.. బిజినెస్ కింగ్స్ నుంచి రియల్ ఎస్టేట్ డాన్స్ వరకు ప్రతీ ఒక్కరు సేఫ్ గా భావించే రియల్ ఎస్టేట్ హబ్.  తెలుగు రాజకీయ నాయకులకు కూడా దుబాయ్ లో భారీగా ఆస్తులు ఉన్నాయి. అలాంటి దుబాయ్ ను ఇప్పుడు యుద్ధం షేక్ చేసింది. పెట్టుబడి పెట్టాలంటే భయపడే పరిస్థితి క్రియేట్ అయింది. ఈ మూమెంట్ లో దుబాయ్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనే ఒపినియన్ దాదాపుగా ఇన్వెస్టర్స్ లో వచ్చేసింది. అసలు దుబాయ్ లో రియల్ సిచ్యువేషన్ ఎలా ఉంది..? ఈ స్టోరీలో చూద్దాం.

దుబాయ్ రియల్ ఎస్టేట్ హిస్టరీలో.. ఈ నెల మొదటి నుంచి ఎదుర్కొంటున్న ఇబ్బందులు గతంలో.. ఎన్నడు చూడలేదు. దుబాయ్ లో రియల్ ఎస్టేట్ మార్కెట్ భారీగా డౌన్ ఫాల్ నడుస్తోంది. కేవలం ఐదు ట్రేడింగ్ సెషన్లలోనే దుబాయ్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ 20% డౌన్ అయింది. దీనితో ఇన్వెస్టర్ లలో భయం మొదలైంది. బుర్జ్ ఖలీఫా నిర్మించిన ఎమార్ ప్రాపర్టీస్ షేర్లు దాదాపు 13.6%, డెయార్ డెవలప్‌మెంట్ షేర్లు 11.6% పడిపోయాయి. ఈ పతనం వల్ల 2025 సంవత్సరం పొడవునా వచ్చిన లాభాలన్నీ కేవలం ఐదు రోజుల్లోనే వాష్ అవుట్ అయ్యాయి. బాండ్ మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది. డెవలపర్లకు నిధులు ఇచ్చే బాండ్ మార్కెట్ ప్రస్తుతం దాదాపు మూతపడింది. కొత్త పెట్టుబడులు కూడా వచ్చే అవకాశాలు కనపడటం లేదు.

యుద్ద ప్రభావం అనేది దుబాయ్ మార్కెట్ మీద భారీగా పడుతోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు దుబాయ్, అబుదాబిలోని కొన్ని నివాస ప్రాంతాలు, విమానాశ్రయాలు, ఓడరేవుల సమీపంలో పడటం ఇన్వెస్టర్లలో భయం పీక్స్ కు తీసుకెళ్ళింది. ఇక దుబాయ్ సహా గల్ఫ్ దేశాల్లో నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగే సంకేతాలే కనపడుతున్నాయి. యుద్ధం వల్ల సరుకు రవాణా మార్గాలు.. ముఖ్యంగా హార్మోజ్ జల సంధి ఆగిపోవడంతో.. స్టీల్, గ్లాస్ వంటి నిర్మాణ సామాగ్రి ధరలు 10-15% పెరిగే అవకాశం ఉంది.

నిర్మాణంలో ఉన్న ఇళ్ల అమ్మకాలు 65% వరకు పడిపోయాయి. కొత్తగా బుక్ చేసుకున్న వారు తమ అగ్రిమెంట్లను రద్దు చేసుకుంటున్నారు. ఇక గంటల వ్యవధిలోనే కోట్ల రూపాయలు పడిపోయింది. ఫ్లాట్ ధర గంటలోనే 7.5 కోట్లు పడిపోయింది. చైనా, హాంకాంగ్‌, ఇండియాకు చెందిన బిలియనీర్లు తమ పెట్టుబడులను దుబాయ్ నుండి విత్ డ్రా చేసుకుని, సింగపూర్ వైపు మళ్లిస్తున్నారు. యుద్ధ భయంతో విదేశీ కొనుగోలుదారులు, ముఖ్యంగా భారతీయులు, చైనీయులు తమ ప్రాపర్టీ బుకింగ్‌లను క్యాన్సల్ చేసుకుంటున్నారు. దుబాయ్‌లో అతిపెద్ద ఇన్వెస్టర్లైన భారతీయులు ఇప్పుడు రిస్క్ తీసుకోలేక, స్వదేశంలోని ప్రీమియం ప్రాజెక్టులపై దృష్టి పెడుతున్నారు.

ముంబై, బెంగళూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడుతున్నారు. విదేశీ పెట్టుబడిదారులు కూడా ఈ ప్రాంతాలనే సేఫ్ జోన్ గా చూస్తున్నారు. యుద్ధం ఇలాగే కొనసాగితే షార్ట్ టైంలో ప్రాపర్టీ రేట్స్ 30% నుండి 40% వరకు తగ్గుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక రెంట్ పై కూడా ఈ యుద్ధం ప్రభావం భారీగా పడుతోంది. విదేశీయులు ప్రాణ భయంతో పరుగులు తీయడంతో.. దుబాయ్ లో రెంట్ లు భారీగా పడిపోతున్నాయి. దుబాయ్ ప్రభుత్వం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, యుద్ధం వల్ల కలిగిన పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నా.. దుబాయ్ సేఫ్ హెవెన్ కాదనే ఒపినియన్ లో వ్యాపారస్తులు ఉండటంతో దుబాయ్ రియల్ ఎస్టేట్ భారీగా పడిపోయింది.

Published : 
  • 11 March 2026, 12:23 PM IST