KCR: కేసీఆర్‌లో కంగారు.. నేతలకు వరుస ఫోన్లు.. ఓటమి భయమా..? జాగ్రత్తా..?
ఒకవైపు వేర్వేరు నియోజకవర్గాల్లో పర్యటిస్తూనే.. మరోవైపు బీఆర్‌ఎస్ అభ్యర్థులకు ప్రతి రోజూ ఫోన్లు చేస్తూ, ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితిని తెలుసుకుంటున్నారు. సానుకూలతలు, ప్రతికూలతలను విశ్లేషిస్తూ.. వారికి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు.