మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ వివాదాలు ముదురుతున్నాయి. మొయినాబాద్ డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అసైన్డ్ భూమిలో ఫామ్‌హౌస్ నిర్మించినట్లు రెవెన్యూ అధికారులు నిర్ధారించి, దానిని వెంటనే సీజ్ చేశారు.
డ్రగ్స్ పార్టీకి వేదికగా మారిన ఈ ఫామ్‌హౌస్‌లో రోహిత్ రెడ్డిని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు, అక్కడే ఆయనను విచారించే అవకాశం ఉంది. పార్టీకి హాజరైన వారి వాహనాలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ ఆరోపణలతో పాటు భూ అక్రమాల కేసు కూడా తోడవడంతో రోహిత్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ఈ కేసులో ఇంకా ఎంతమంది ప్రముఖుల పేర్లు బయటపడతాయోనన్న ఉత్కంఠ నెలకొంది.