Top story: పిజ్జా, హాట్‌డాగ్‌, చీజ్, పాస్తా ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో సీక్రెట్‌ కోడ్స్‌…!

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరెత్తితే...సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, విఐపీలకు గుండెల్లో వణుకు పుడుతోంది. చిన్నారులు, బాలికలు, మైనర్లను...విఐపీలకు ఎరవేసి కోట్లు సంపాదించాడు. ఏళ్ల పాటు అరాచకత్వం కొనసాగించాడు.

Post Published By: dialnews
Updated : 16 March 2026, 10:24 AM IST

ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరెత్తితే...సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, విఐపీలకు గుండెల్లో వణుకు పుడుతోంది. చిన్నారులు, బాలికలు, మైనర్లను...విఐపీలకు ఎరవేసి కోట్లు సంపాదించాడు. ఏళ్ల పాటు అరాచకత్వం కొనసాగించాడు. విఐపీలను తన ఐలాండ్‌కు ఆహ్వానించే సమయంలో...ఎప్‌స్టీన్‌ వాడిన సీక్రెట్‌ కోడ్ ఏంటి ? పిజ్జా, హాట్‌డాగ్‌ అని ఎవర్ని పిలిచేవాడు ?ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం సంచలనం సృష్టించింది. 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. 2వేలకు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫొటోలను విడుదల చేసింది. బిజినెస్‌మ్యాన్‌గా పేరున్న ఎప్‌స్టీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులతోనూ నిత్యం టచ్‌లో ఉండేవాడు. తన వ్యాపార అవసరాల కోసం రాజకీయ నేతలు, అధికారులను ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకునేవాడు. లొంగని వారిని అమ్మాయిలు, బాలికలను ఎర వేసి ట్రాప్‌ చేసేవాడు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్, స్టీవ్ బ్యానన్, వూడీ అలెన్, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు ఉన్నారు. బడా బాబులకు, రాజకీయ పెద్దలకు, సెలబ్రిటీలకు అమ్మాయిలు, మైనర్లను సప్లై చేసేవాడు. వారిలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలను ఎర వేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎప్‌స్టీన్...వీఐపీలు, సెలబ్రెటీలతో జరిపిన సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. అమ్మాయిలు, మైనర్లు, అబ్బాయిలకు పదే పదే పిజ్జా, పాస్తా, చీజ్‌ వంటి పేర్లు వాడారు. ఎవరికీ అనుమానం రాకుండా.. వారందరికి జంక్‌ ఫుడ్‌ పేర్లతో పిలిచాడు. హాట్ డాగ్, పిజ్జా, చీజ్, పాస్తా, వాల్‌నట్, ఐస్ క్రీమ్, మ్యాప్, సాస్ వర్డ్స్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. పిజ్జా అనే పదాన్ని సుమారు 900 సార్లు వాడాడు. పిజ్జా అంటే అమ్మాయికి పెట్టిన కోడ్ వర్డ్‌గా అధికారులు భావిస్తున్నారు. ఈ పదాలను మాజీ FBI అధికారి డికోడ్ చేశారని చెబుతున్నారు. అబ్బాయికి హాట్‌డాగ్, అమ్మాయికి పిజ్జా, బాలికలకు చీజ్‌, బాలుడికి అయితే పాస్తా అని విఐపీలు చెప్పినట్లు అనుమానిస్తున్నారు. మగ వ్యభిచారులకు ఐస్‌క్రీమ్, వ్యక్తుల రంగును బట్టి వాల్‌నట్ అని, గ్రూప్‌ సెక్స్‌ను సాస్‌ పేరుతో సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న ఈ కోడ్ వర్డ్స్‌ చర్చనీయాంశంగా మారింది. 3 మిలియన్ల పేజీల్లో పిజ్జా అనే పదం 9వందల సార్లు ఉపయోగించారు. ఫిబ్రవరి 2న పిజ్జా వర్డ్ సుమారు 911 సార్లు కనిపించింది. ఆ తర్వాత సుమారు 60 రిఫరెన్సులను అధికారులు ఫైల్స్ నుంచి తొలగించారు. కానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. ఈ వర్డ్స్‌ను అతడు ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. ఏ సమయానికి నీకు పిజ్జా కావాలి అని ఎప్‌స్టీన్ అడిగినట్లు తెలుస్తోంది. నీ పిజ్జా చాలా యమ్మీ యమ్మీగా ఉందంటూ అవతలి వ్యక్తులు రిప్లై ఇచ్చినట్లు సమాచారం.ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల సమయంలో బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌. బాధితుల గోప్యత కోసం అమెరికా న్యాయశాఖ వందలాది న్యాయవాదులను నియమించింది.ఇక విడుదల చేసిన వీడియోలు, చిత్రాల్లో ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తప్పించి, మిగిలిన మహిళలందరి గుర్తింపులను అస్పష్టంగా చూపించింది.ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ పేరెత్తితే...సెలబ్రెటీలు, రాజకీయ నేతలు, విఐపీలకు గుండెల్లో వణుకు పుడుతోంది. చిన్నారులు, బాలికలు, మైనర్లను...విఐపీలకు ఎరవేసి కోట్లు సంపాదించాడు. ఏళ్ల పాటు అరాచకత్వం కొనసాగించాడు. విఐపీలను తన ఐలాండ్‌కు ఆహ్వానించే సమయంలో...ఎప్‌స్టీన్‌ వాడిన సీక్రెట్‌ కోడ్ ఏంటి ? పిజ్జా, హాట్‌డాగ్‌ అని ఎవర్ని పిలిచేవాడు ?

ప్రపంచవ్యాప్తంగా ఎప్‌స్టీన్‌ సెక్స్‌ కుంభకోణం సంచలనం సృష్టించింది. 30 వేల పేజీల డాక్యుమెంట్లను అమెరికా న్యాయశాఖ విడుదల చేసింది. 2వేలకు పైగా వీడియోలు, సుమారు 1.80 లక్షల ఫొటోలను విడుదల చేసింది. బిజినెస్‌మ్యాన్‌గా పేరున్న ఎప్‌స్టీన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వాల్లో కీలక పోస్టుల్లో ఉన్న అధికారులతోనూ నిత్యం టచ్‌లో ఉండేవాడు. తన వ్యాపార అవసరాల కోసం రాజకీయ నేతలు, అధికారులను ప్రలోభాలకు గురి చేసి లొంగదీసుకునేవాడు. లొంగని వారిని అమ్మాయిలు, బాలికలను ఎర వేసి ట్రాప్‌ చేసేవాడు. ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌లో బిల్ గేట్స్, స్టీవ్ బ్యానన్, వూడీ అలెన్, మాజీ అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ వంటి ప్రముఖులు ఉన్నారు. బడా బాబులకు, రాజకీయ పెద్దలకు, సెలబ్రిటీలకు అమ్మాయిలు, మైనర్లను సప్లై చేసేవాడు. వారిలో కేవలం అమ్మాయిలు మాత్రమే కాదు.. అబ్బాయిలను ఎర వేసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఎప్‌స్టీన్...వీఐపీలు, సెలబ్రెటీలతో జరిపిన సంభాషణలు ఆసక్తికరంగా మారాయి. అమ్మాయిలు, మైనర్లు, అబ్బాయిలకు పదే పదే పిజ్జా, పాస్తా, చీజ్‌ వంటి పేర్లు వాడారు. ఎవరికీ అనుమానం రాకుండా.. వారందరికి జంక్‌ ఫుడ్‌ పేర్లతో పిలిచాడు. హాట్ డాగ్, పిజ్జా, చీజ్, పాస్తా, వాల్‌నట్, ఐస్ క్రీమ్, మ్యాప్, సాస్ వర్డ్స్‌ను వాడినట్లు తెలుస్తోంది. ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. పిజ్జా అనే పదాన్ని సుమారు 900 సార్లు వాడాడు. పిజ్జా అంటే అమ్మాయికి పెట్టిన కోడ్ వర్డ్‌గా అధికారులు భావిస్తున్నారు. ఈ పదాలను మాజీ FBI అధికారి డికోడ్ చేశారని చెబుతున్నారు. అబ్బాయికి హాట్‌డాగ్, అమ్మాయికి పిజ్జా, బాలికలకు చీజ్‌, బాలుడికి అయితే పాస్తా అని విఐపీలు చెప్పినట్లు అనుమానిస్తున్నారు. మగ వ్యభిచారులకు ఐస్‌క్రీమ్, వ్యక్తుల రంగును బట్టి వాల్‌నట్ అని, గ్రూప్‌ సెక్స్‌ను సాస్‌ పేరుతో సంభాషణలు జరిపినట్లు తెలుస్తోంది.

ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ఉన్న ఈ కోడ్ వర్డ్స్‌ చర్చనీయాంశంగా మారింది. 3 మిలియన్ల పేజీల్లో పిజ్జా అనే పదం 9వందల సార్లు ఉపయోగించారు. ఫిబ్రవరి 2న పిజ్జా వర్డ్ సుమారు 911 సార్లు కనిపించింది. ఆ తర్వాత సుమారు 60 రిఫరెన్సులను అధికారులు ఫైల్స్ నుంచి తొలగించారు. కానీ, ఎప్‌స్టీన్ ఫైల్స్ ప్రకారం.. ఈ వర్డ్స్‌ను అతడు ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్నట్లు స్పష్టమైంది. ఏ సమయానికి నీకు పిజ్జా కావాలి అని ఎప్‌స్టీన్ అడిగినట్లు తెలుస్తోంది. నీ పిజ్జా చాలా యమ్మీ యమ్మీగా ఉందంటూ అవతలి వ్యక్తులు రిప్లై ఇచ్చినట్లు సమాచారం.ఎప్‌స్టీన్‌ ఫైల్స్‌ విడుదల సమయంలో బాధిత యువతుల ఫొటోలు, పేర్లు బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంది జస్టిస్‌ డిపార్ట్‌మెంట్‌. బాధితుల గోప్యత కోసం అమెరికా న్యాయశాఖ వందలాది న్యాయవాదులను నియమించింది.ఇక విడుదల చేసిన వీడియోలు, చిత్రాల్లో ఘిస్లేన్ మ్యాక్స్‌వెల్‌ను తప్పించి, మిగిలిన మహిళలందరి గుర్తింపులను అస్పష్టంగా చూపించింది.

Published : 
  • 16 March 2026, 10:24 AM IST