Top story: ప్రకాష్ రాజ్ ఓటుపై ఈసీ షాకింగ్.. ప్రకటన ప్రకాష్ రాజ్ కు ఫోన్ చేసే షాక్ ఇచ్చారా..?

ఈ పేరు వినగానే మనకు వర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు, లౌడ్ అండ్ క్లియర్ గా పొలిటికల్ వాయిస్ వినిపించే ఒక లీడర్ కూడా గుర్తుకొస్తారు. అయితే ప్రస్తుతం ఈయన చుట్టూ ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ నడుస్తోంది.

Post Published By: dialnews
Updated : 13 August 2026, 6:20 PM IST

ఈ పేరు వినగానే మనకు వర్సటైల్ యాక్టర్ మాత్రమే కాదు, లౌడ్ అండ్ క్లియర్ గా పొలిటికల్ వాయిస్ వినిపించే ఒక లీడర్ కూడా గుర్తుకొస్తారు. అయితే ప్రస్తుతం ఈయన చుట్టూ ఒక రేంజ్ లో పొలిటికల్ వార్ నడుస్తోంది. "నా సొంత ఊర్లోనే నా ఓటు హక్కును అక్రమంగా డిలీట్ చేశారు.. ఇదొక పెద్ద జోక్" అంటూ ప్రకాశ్ రాజ్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్, చేసిన వీడియో దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. ఒక సెలబ్రిటీ, అందునా గతంలో ఎంపీగా పోటీ చేసిన వ్యక్తి ఓటే గల్లంతైతే.. ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? అంటూ విపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. కానీ, సరిగ్గా ఇక్కడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్! ప్రకాశ్ రాజ్ చేసిన ఆరోపణలను తిప్పికొడుతూ.. అసలు ఆయన ఓటు ఎందుకు పోయింది? దీని వెనుక ఉన్న చట్టపరమైన కారణాలు ఏంటి? గతంలో ప్రకాశ్ రాజ్‌కు ఎక్కడెక్కడ ఓట్లు ఉన్నాయి? అనే విషయాలపై ఈసీ ఇచ్చిన క్లారిటీతో ఈ కథ మొత్తం అడ్డం తిరిగింది.

మొదటగా ప్రకాశ్ రాజ్ ఆరోపణలను పరిశీలిస్తే.. బెంగళూరు సెంట్రల్ పరిధిలోని శాంతినగర నియోజకవర్గంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ జరిగింది. ఇందులో తన ఓటును ఏకపక్షంగా తొలగించారని ఆయన వాదించారు. తాను పుట్టి, పెరిగి, చదువుకున్న ఏరియా ఇదని.. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తాను స్వతంత్ర అభ్యర్థిగా బెంగళూరు సెంట్రల్ నుంచే పోటీ చేశానని గుర్తుచేశారు. అలాంటి తన ఓటును, తనతో పాటు సుమారూ 65 లక్షల మంది ఓట్లను జాబితా నుండి తొలగించడం వెనుక పెద్ద రాజకీయ కుట్ర దాగి ఉందని ప్రకాశ్ రాజ్ నేరుగా రూలింగ్ గవర్నమెంట్ పై విమర్శలు చేశారు. దీనిపై దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో ఎన్నికల అధికారులు ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నారు.

ప్రకాశ్ రాజ్ ఆరోపణలు వచ్చిన వెంటనే బెంగళూరు అడిషనల్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ జగదీష్ రంగంలోకి దిగి అధికారిక నివేదికను విడుదల చేశారు. ఈసీ తెలిపిన వివరాల ప్రకారం.. ఎన్నికల సంఘం ఎవరి ఓటును కావాలని లేదా ఏకపక్షంగా తొలగించదు. ఓటరు జాబితా సవరణలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు ప్రకాశ్ రాజ్ ఓటర్ ఐడీలో నమోదైన చిరునామాకు స్వయంగా వెళ్లి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అయితే, ప్రకాశ్ రాజ్ గత నాలుగేళ్లుగా ఆ పాత అడ్రస్‌లో నివసించడం లేదని అధికారులు గుర్తించారు. అక్కడ ఉన్న ప్రాపర్టీ మేనేజర్ కూడా ప్రకాశ్ రాజ్ ఇల్లు మారి చాలా కాలం అయ్యిందని లిఖితపూర్వకంగా ధృవీకరించారు. దాంతో నిబంధనల ప్రకారం ఆయన ఓటును "శాశ్వతంగా బదిలీ అయ్యారు" అనే కేటగిరీ కింద జాబితా నుండి తొలగించినట్లు అధికారులు ఆధారాలతో సహా నిరూపించారు.

ఈ కథలో అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఓటును పూర్తిగా తొలగించడానికి ముందే ఎన్నికల అధికారులు స్వయంగా ప్రకాశ్ రాజ్‌తో ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆ సంభాషణలో.. తాను ప్రస్తుతం ఆ పాత చిరునామాలో ఉండటం లేదని, అదే శాంతినగర నియోజకవర్గంలోని మరో లొకేషన్ లో నివసిస్తున్నట్లు ఆయనే స్వయంగా అధికారులతో అంగీకరించారు. భారతదేశ ఎన్నికల చట్టం ప్రకారం ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట చిరునామాలో నివసించనప్పుడు అక్కడ ఓటు హక్కు రద్దు కావడం అనేది పూర్తిగా చట్టబద్ధమైన ప్రక్రియ. ప్రస్తుత చిరునామా ఆధారంగా కొత్తగా ఫామ్-6 సమర్పించి మళ్లీ ఓటు హక్కును సులభంగా నమోదు చేసుకోవచ్చని అధికారులు ఆయనకు ఫోన్ లోనే సూచించారు. అయినప్పటికీ ప్రకాశ్ రాజ్ ఈ విషయాన్ని తెలుసుకుని కూడా సాషల్ మీడియాలో ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ లబ్ధి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

అయితే, ఈ ఓటు వివాదం వెనుక ఒక బలమైన పాత బ్యాక్‌గ్రౌండ్ కూడా ఉంది. ప్రకాశ్ రాజ్‌కు కేవలం కర్ణాటకలోనే కాకుండా.. గతంలో తమిళనాడు, తెలంగాణ వంటి మూడు వేర్వేరు రాష్ట్రాలలో ఓటు హక్కులు కలిగి ఉన్నారనే ఆరోపణలపై ఒక ప్రైవేట్ కోర్టు కేసు నమోదైంది. మన దేశ ఎన్నికల నిబంధనల ప్రకారం ఒక వ్యక్తికి ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ ప్రాంతాలలో ఓటు హక్కు ఉండటం తీవ్రమైన నేరం. ఈ మల్టిపుల్ ఓటర్ ఐడీల వివాదంలోనే గత జూలైలోనే ఆయన కోర్టు నుంచి షరతులతో కూడిన బెయిల్ కూడా పొందారు.

ఈ పాత కేసుల నేపథ్యం ఉండటం వల్లే, ఎన్నికల అధికారులు ఆయన ఓటర్ ఐడీ వెరిఫికేషన్ విషయంలో మరింత పక్కాగా వ్యవహరించారని, నివాసం లేని పాత అడ్రస్ నుండి ఓటును తొలగించారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా చట్టం సెలబ్రిటీలకైనా, సామాన్యులకైనా ఒక్కటే. మనం ఇల్లు మారినప్పుడు బాధ్యతగా మన కొత్త అడ్రస్‌కు ఓటును బదిలీ చేసుకోవాలి. అలా చేసుకోకుండా పాత ఓటు రద్దయితే దాన్ని రాజకీయం చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

Published : 
  • 13 August 2026, 6:20 PM IST