Top story: ఆ ఇద్దరు మహిళా ఐఏఎస్ లను టార్గెట్ చేసింది ఎవరు?

స్మిత సబర్వాల్, ఆమ్రపాలి కాటా తెలంగాణలో ఒకప్పుడు మోస్ట్ పాపులర్ ఐఏఎస్ అధికారినిలు. ఈ ఇద్దరు మహిళ ఐఏఎస్లు ఒకప్పుడు అధికార యంత్రాంగంలో ఓ క్రేజ్. సోషల్ మీడియాలోనూ యాక్టివ్. ఒక రకంగా చెప్పాలంటే ఐఏఎస్

Post Published By: dialnews
Updated : 13 August 2026, 3:30 PM IST

స్మిత సబర్వాల్, ఆమ్రపాలి కాటా తెలంగాణలో ఒకప్పుడు మోస్ట్ పాపులర్ ఐఏఎస్ అధికారినిలు. ఈ ఇద్దరు మహిళ ఐఏఎస్లు ఒకప్పుడు అధికార యంత్రాంగంలో ఓ క్రేజ్. సోషల్ మీడియాలోనూ యాక్టివ్. ఒక రకంగా చెప్పాలంటే ఐఏఎస్ లలో సెలబ్రిటీ హోదా అనుభవించారు. పోస్టింగ్ ఎక్కడైనా తమదైన మార్క్.....వేగవంతమైన నిర్ణయాలు.. డైనమిక్ వర్కింగ్ తో ప్రజల్లోనూ, మీడియాలోనూ స్మిత సబర్వాల్ కి , ఆమ్రపాలికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. తెలుగు రాష్ట్రాల బ్యూరోక్రసీలో అలాంటి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు మహిళా ఐఏఎస్లు వివాదాల్లో చిక్కుకొని చివరికి లూప్ లైన్ లో పడిపోయారు.ఏపీకి చెందిన ఆమ్రపాలి కాటా వరంగల్ కలెక్టర్‌గా , జీహెచ్‌ఎంసీలోనూ కీలక బాధ్యతలు నిర్వహించారు. ఫీల్డ్ లో చాలా యాక్టివ్ గా ఉండేవారు.

మధ్యలో సెంట్రల్ సర్వీస్ కి వెళ్ళినప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక ఆమ్రపాలిని సి ఎం ఓ లోకి తీసుకున్నారు . ఇక స్మితా సబర్వాల్ కెసిఆర్ హయాంలో కీలక అధికారుల్లో ఒకరిగా కొనసాగారు. ముఖ్యమంత్రి కార్యాలయంతో పాటు మిషన్ భగీరథ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో స్మితపై విమర్శలు కూడా వచ్చాయి. ఒక పరువు నష్టం కేసులో రాష్ట్ర ప్రభుత్వం స్మితాకి న్యాయ సహకారం అందించడం, అందుకు 15 లక్షల రూపాయలు చెల్లించడం పై అప్పట్లో చాలా వివాదం అయింది.సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే స్మిత కొన్ని సార్లు తన స్టేట్మెంట్స్ ద్వారా వివాదాల్లో ఇరుక్కున్నారు. వికలాంగులపై కామెంట్స్ చేసి పెద్ద గొడవే తెచ్చుకున్నారు. స్మిత సబర్వాల్ భర్త అకున్ సబర్వాల్ సీనియర్ ఐపీఎస్ అధికారి. ఇప్పుడు సెంట్రల్ సర్వీస్ లో ఉన్నారు. ఆమ్రపాలి భర్త కూడా ఐపీఎస్ అధి కారే.

కాట ఆమ్రపాలిని ఏపీ కేడర్‌కు కేటాయించగా... తెలంగాణలో కొనసాగేందుకు ఆమె న్యాయపరమైన మార్గాలను ఆశ్రయించారు. క్యాట్ నుంచి కోర్టుల వరకు ఈ వ్యవహారం సాగింది. చివరకు కేంద్ర ప్రభుత్వ క్యాడర్ రూల్స్ ప్రకారం ఆమె ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లక తప్పులేదు. తెలంగాణలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆమ్రపాలి ఏపీ లో ప్రాధాన్యం లేని పోస్టు కేటాయించారు. తెలంగాణ సీఎం ఓలో కీలక పాత్ర పోషించిన ఆమ్రపాలి ఏపీలో టూరిజం శాఖ ఎండిగా చేయడానికి ఇబ్బంది పడ్డారు. దీర్ఘకాలం సెలవు లో వెళ్లిపోయారు దీంతో ఆమెను జి ఏడికి రిపోర్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. సొంత రాష్ట్రమైన ఏపీలో పని చేయలేక, ఇష్టమైన తెలంగాణ దక్కక.... ఆమ్రపాలి ఇప్పుడు సెంట్రల్ సర్వీస్ కి ప్రయత్నం చేసుకుంటున్నారు.

ఇక స్మితా సబర్వాల్ పరిస్థితి మరోలా ఉంది. కెసిఆర్ హయాంలో ఆమె పేరు ప్రముఖంగా వినిపించేది. సీఎంవోలో సుదీర్ఘకాలం పనిచేయడంతో పాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషించారు.ఐఏఎస్ అధికారినిగా కంటే ఒక టిఆర్ఎస్ నేతల ఆమె వ్యవహరించారని విమర్శలు కూడా ఉన్నాయి. ప్రభుత్వం మారిన తర్వాత పాలనా సమీకరణాలు కూడా మారాయి. కొత్త ప్రభుత్వం తన ప్రాధాన్యతలకు అనుగుణంగా అధికారుల బాధ్యతలను మార్చడంతో స్మితా సబర్వాల్‌కు తగిన పోస్ట్ దక్కలేదు. కెసిఆర్ కి సన్నిహిత అధికారిని అనే ముద్ర పడిపోవడంతో రేవంత్ సర్కార్లో సహజంగానే ఆమెను దూరంగా పెట్టారు.

ప్రభుత్వం మరినప్పుడు కొందరు అధికారుల ప్రాధాన్యత పెరగడం, మరికొందరికి తగ్గడం బ్యూరోక్రసీలో కొత్తేమీ కాదు. కీలక స్థానాల్లో ఎవరుండాలి..? ఎవరికి ఏ బాధ్యత అప్పగించాలి..? అనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే ఒక ప్రభుత్వంలో అత్యంత కీలకంగా పనిచేసిన అధికారులు... ప్రభుత్వం మారగానే ప్రధాన బాధ్యతలకు దూరం కావడం మాత్రం ప్రతిసారీ చర్చకు దారితీస్తుంది. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ విషయంలోనూ ఇప్పుడు అదే జరుగుతుంది. ఆమ్రపాలి, స్మితా సబర్వాల్ పనితీరుపై భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. వారి పరిపాలనా శైలిపై విమర్శలు, ప్రశంసలు రెండూ ఉండొచ్చు. కానీ అడ్మినిస్ట్రేషన్‌లో అనుభవం ఉన్న అధికారులు ప్రధాన బాధ్యతలకు దూరమైపోతే ఎలా?... వారి అనుభవాన్ని ప్రభుత్వాలు పూర్తిస్థాయిలో ఉపయోగించు కోలేక పోతున్నాయా? అనే చర్చ జరుగుతుంది.

అయితే మరో వాదన కూడా ఉంది. స్మితా సబర్వాల్ లాంటి అధికారులు సమర్థులే అయినప్పటికీ,తాము ప్రభుత్వ అధికారులు అనే విషయాన్ని మర్చిపోయి....పార్టీ నాయకుల్లాగా... ముఖ్యమంత్రి ఇంటి మనుషుల్లాగా వ్యవహరిస్తే.... అధికారం కోల్పోయిన తర్వాత పరిస్థితి ఇలాగే ఉంటుందని విమర్శలు వస్తున్నాయి. ఏపీలో ఐఏఎస్ శ్రీలక్ష్మి, ఐపీఎస్ సీతారామాంజనేయులు లాంటి అధికారులు ప్రభుత్వ పెద్దలతో అంటకాగి వృత్తిలో పతనమయ్యారు అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కొందరు. ఇక ఆమ్రపాలి కాటా లాంటివాళ్ళు మాకు పలానా రాష్ట్రం ఇష్టం... ఆ రాష్ట్రంలోనే పనిచేస్తాం అనడందారుణమని... కేంద్రం ఐఏఎస్ అధికారులను ఎక్కడికి పంపితే అక్కడ పని చేయాలని ఆ మాత్రం కనీస స్పృహ లేకుండా ప్రభుత్వ నిర్ణయాన్ని ఆమ్రపాలి ఎలా ఛాలెంజ్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద ఈ మహిళ ఐఏఎస్ అధికారులు ఇద్దరు, సొంత అజెండాలతో అసలుకే ఎసరు తెచ్చుకున్నారు.

Published : 
  • 13 August 2026, 3:30 PM IST